S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/22/2016 - 03:58

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఐవా స్టేట్ వర్శిటీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికాలోని ఐవాలో ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఐవా స్టేట్ వర్శిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సీడ్ పార్క్‌తో పాటు ఎపి సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

11/22/2016 - 03:56

చింతకాని, నవంబర్ 21: పెద్దనోట్ల మార్పిడి ఇబ్బందులు అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి పసిప్రాణాన్ని బలిగొన్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీలో నివాసముండే నెరుసుల నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప యమునకి మూడేళ్లు. వారం క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగొచ్చారు.

11/22/2016 - 03:54

ఏలూరు, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దుద్వారా ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం, పోలవరం ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ప్రధాన అంశాలపై తన స్పందనను వెలిబుచ్చారు.

11/22/2016 - 03:47

విజయవాడ, నవంబర్ 21: అమరావతిలో యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ బృందానికి ఎపి సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు.

11/22/2016 - 03:45

విజయవాడ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దును సామాన్య ప్రజలు సైతం స్వాగతిస్తున్నారనీ, అయితే ఏఒక్కరూ ఇబ్బందిపడకుండా ముందుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టటంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

11/22/2016 - 03:42

తిరుపతి, నవంబర్ 21: పెద్దనోట్లు రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంతో మంచి రోజులు రావాలంటే ఇంకెంత మంది చనిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీని చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ సూటిగా ప్రశ్నించారు.

11/22/2016 - 03:38

విశాఖపట్నం, నవంబర్ 21: ఆస్తి కోసం రక్త సంబంధీకులను హతమార్చిన సంఘటనలు చూశాం. అయితే త్వరలో చనిపోతాడని తెలిసిన వ్యక్తి పేరిట బీమా చేయించి, అనంతరం హత్య చేసి బీమా సొమ్ము దక్కించుకున్న నిందితుల జాతకాలు పోలీసులు బయటపెట్టారు. వినడానికి ఇది సినిమా కథలా ఉన్నప్పటికీ విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్తి వివరాలను నగర శాంతి భద్రతల డిసిపి నవీన్ గులాఠీ సోమవారం విలేఖరులకు వెల్లడించారు.

11/22/2016 - 03:38

గిద్దలూరు, నవంబర్ 21: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మండలంలోని గడికోట గ్రామ మాజీ ఎంపిటిసి దోనపాటి రమణ (40)ను ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు మెడ, గొంతుపై నరికి దారుణంగా హత్య చేశారు. దోనపాటి రమణ ఆదివారం రాత్రి గ్రామ శివారులోని సగిలేరు వాగు సమీపంలోగల వరి పొలానికి నీరు కట్టేందుకు వెళ్ళాడు.

11/22/2016 - 03:37

నెల్లూరు, నవంబర్ 21: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలలో దంత వైద్యులను త్వరలో నియమిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సోమవారం నారాయణ డెంటల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.దంత వైద్యం పట్ల ప్రజలలో అంత అవగాహన లేదని, దంత వైద్యం గురించి గ్రామీణులకు తెలియజేయాలని ఆయన కోరారు.

11/22/2016 - 03:36

భీమవరం, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు ప్రభావం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై కూడా పడింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే సభ ఏర్పాట్లకు కరెన్సీ దొరకక స్థానిక నేతలు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే... భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న భారీ రైతు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది వస్తారని అంచనా.

Pages