S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/19/2016 - 04:01

ప్రత్తిపాడు, నవంబర్ 18: రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి మరిచిపోయిన తరువాత ఆ హామీని అమలు చేయాలని కాపులు రోడ్డెక్కారన్నారు.

11/19/2016 - 03:58

విజయవాడ, నవంబర్ 18: భారతదేశం గర్వించదగ్గ నేత, దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. ‘ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్లు నేడొక ప్రకటనలో తెలిపారు.

11/19/2016 - 03:57

అంబాజీపేట, నవంబర్ 18: దరఖాస్తు చేసుకుంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ముద్రగడకు చెప్పినా వినలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైనా నిరసన వ్యక్తం చేయవచ్చని, కానీ దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్నారు.

11/19/2016 - 03:57

విజయవాడ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పరిస్థితిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ఒక ఎమర్జెన్సీలా భావించి సహకరించాలని ఆర్‌బిఐ, మొబైల్ ఆపరేటర్లు, తపాలా, బ్యాంక్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

11/19/2016 - 03:56

విజయవాడ, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన పౌర సరఫరాల అధికారులతో అన్న క్యాంటీన్లపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

11/19/2016 - 03:56

విశాఖపట్నం, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్యూర్డ్ ఇనె్వస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీసెస్(సిమ్స్) కేసులో క్రైం ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సిఐడి) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సిమ్స్‌కు సంబంధించి రెండు కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎండి, డైరెక్టర్లు సహా 15 మందిపై అభియోగాలు నమోదు చేసింది.

11/19/2016 - 03:55

విజయవాడ, నవంబర్ 18: ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ సరఫరాకు సర్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా కొవ్వూరు, రాజమహేంద్రవరంలో ఇంటింటికీ పైప్ లైన్‌తో గ్యాస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. మలి విడతగా వచ్చే ఏడాది జూన్ నాటికి భీమవరం, ఏలూరులో సరఫరా చేయాలని భావిస్తోంది.

11/19/2016 - 03:54

రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ కమిటీ నివేదికను యూనివర్సిటీ అధికారులు బేఖాతరు చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని విచారించడానికి గవర్నర్ ఆదేశాల మేరకు ద్విసభ్య నిపుణుల కమిటీ విచారణ జరిపి అవకతవకలు జరిగాయని నివేదిక ఇచ్చింది.

11/19/2016 - 03:54

మదనపల్లె, నవంబర్ 18: జనచైతన్య యాత్రలకు వెళ్తున్న ఎమ్మెల్సీ కారు, మదనపల్లె నుంచి తిరుపతిరోడ్డులో ప్యాసింజర్‌లతో సిటిఎంకు వెళ్తున్న షేర్‌ఆటో ఢీకొంది. ఈఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఎమ్మెల్సీ ఎన్ నరేష్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది.

11/19/2016 - 03:53

భీమవరం, నవంబర్ 18: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న రైతు సభను వినూత్నంగా నిర్వహించడానికి పార్టీ నేతలు కృషిచేస్తున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే ఈ సభకు హాజరయ్యే వారంతా పంచెలు ధరించి హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సుమారు లక్షమందిని ఈ సభకు హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు భావిస్తున్న సంగతి విదితమే.

Pages