S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/15/2016 - 06:20

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ముద్రగడ అయినా, ఎవరైనా సరే ఏదైనా ఆందోళన కార్యక్రమానికి చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందేనని, ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద కోటి కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

11/15/2016 - 06:18

కొత్తగూడెం టౌన్, నవంబర్ 14: తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికీ నల్లా ఇచ్చేందుకు 45కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు.

11/15/2016 - 06:18

అమరావతి, నవంబర్ 14: ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఎదురయిన రెండు పరిణామాలు ఉత్సాహం కలిగించాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం, మరుసటి రోజునే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ హైకోర్టు నోటీసులివ్వడంతో శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తోంది.

11/15/2016 - 06:17

కర్నూలు, నవంబర్ 14: నల్లధనం నిర్మూలణకు కేంద్రం తీసుకున్న చర్యకు మరో నిర్ణయం తోడైంది. బ్యాంకులో ఖాతాదారుల లాకర్లను తెరవడానికి డిసెంబరు 31వ తేదీ వరకు అనుమతించవద్దని సోమవారం ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

11/15/2016 - 06:17

తిరుమల , నవంబర్ 14: తిరుమల్లో ప్రతిమాసం నిర్వహించే పౌర్ణమి గరుడసేవ సోమవారం అంగరంగ వైభంగా సాగింది. సాయంత్రం 7 గంటలకు స్వామివారు గరుడునిపై కొలువుదీరి తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమంలో టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు దంపతులు, జె ఇ ఓ శ్రీనివాసరాజు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

11/15/2016 - 06:15

శ్రీశైలం/ మచిలీపట్నం, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జ్వాలాతోరణం నిర్వహించారు. సోమవారం రాత్రి ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సంప్రదాయబద్ధంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం నూలును వెలిగించి జ్వాలా తోరణ మహోత్సవాన్ని శాస్త్రానుసారంగా నిర్వహించారు.

11/15/2016 - 06:09

భద్రాచలం/రాజమహేంద్రవరం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలోని గోదావరి తీరంలో స్నానఘట్టాల వద్ద ఆదివారం రాత్రి గోదావరికి వైభవంగా నదీహారతి ఇచ్చారు. గోదావరి నదీహారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాశీ నుంచి వచ్చిన అర్చకులు మిశ్రా గోదావరికి శాస్త్రోక్తంగా మూడురకాల హారతులిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు.

11/15/2016 - 06:08

విశాఖపట్నం, నవంబర్ 14: తీవ్ర ఉద్రిక్తతల నడుమ జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బిసి కమిషన్ విశాఖలో సోమవారం అభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు చాలక బిసిలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో మరికొన్ని కులాలను బిసిలుగా గుర్తిస్తే ఆయా వర్గాలు మరింత వెనుకబాటు తనానికి గురవుతాయంటూ పలు కులాల నాయకులు మంజునాధ కమిషన్ ఎదుట వాదించారు.

11/14/2016 - 03:32

నెల్లూరు, నవంబర్ 13: నల్లధనం వెలికితీతకు పెద్ద నోట్లను రద్దు చేయడం ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని కఠిన చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నల్లధనంపై యుద్ధం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. నెల్లూరులోని విపిఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో ఆదివారం ఆయన విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

11/14/2016 - 03:27

రావులపాలెం, నవంబర్ 13: పెద్ద కరెన్సీ రద్దుతో ఉన్న నోట్లను మార్చుకోవడానికి సామాన్య ప్రజానీకం రకరకాల తిప్పలు పడుతుంటే ఒక ఆర్టీసీ ఉన్నతాధికారి మాత్రం తన పరపతితో చాలా కులాసాగా మార్పిడి కార్యక్రమం చేపట్టారు.

Pages