S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/07/2016 - 06:57

విజయవాడ, నవంబర్ 6: ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుసగా మూడో ఏడాది ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 20 వరకు దావోస్‌లో ఈ సదస్సు జరగనుంది.

11/07/2016 - 07:50

గుంటూరు, నవంబర్ 6: ప్రముఖ రచయిత, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీకి ప్రతిష్ఠాత్మకమైన అప్పాజోస్యుల- విష్ణ్భుట్ల- కందాళం (అజోవిభో) ఫౌండేషన్ వారి ‘ప్రతిభామూర్తి జీవితకాల సాధన’ పురస్కారం లభించింది. 2017 సంవత్సరానికి అజోవిభో వార్షిక పురస్కారాలను ఆదివారం ప్రకటించారు.

11/07/2016 - 05:11

విశాఖపట్నం, నవంబర్ 6: ‘పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటన చేయాలి. అలా చేయకపోతే, వైకాపా ఎంపిలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లి, ఏపికి జరుగుతున్న అన్యాయం దేశం మొత్తం తెలిసేలా చేస్తాన’ని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత జగన్ అన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే, ప్రత్యేక హోదాయే రిఫరెండమ్‌గా 2019 ఎన్నికలకు వెళతామని ఆయన ప్రకటించారు.

11/07/2016 - 02:50

విశాఖపట్నం(జగదాంబ) నవంబర్ 6: దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండున్నరేళ్ళ పాలనలో ఒక్క స్కామ్ జరగలేదని గత ప్రభుత్వ పాలన స్కామ్‌ల మయమేనని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. విశాఖలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బిజెపి నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా సప్తాహ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

11/07/2016 - 02:48

గుడివాడ, నవంబర్ 6: గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు టిడిపిలో చేరారు. ఆదివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో యలవర్తి టిడిపి కండువా కప్పుకున్నారు.

11/07/2016 - 02:46

విజయనగరం, నవంబర్ 6: విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా వినోద యాత్రల ద్వారా మరికొంత విజ్ఞానాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులను వినోద యాత్రలకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొ విద్యార్థికి రూ.200 చొప్పున నిధులు మంజూరు చేసింది.

11/07/2016 - 02:45

విజయవాడ, నవంబర్ 6: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న మున్సిపల్ కార్మికుల కడుపుకొట్టేందుకు కార్మికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 279 తక్షణం రద్దు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి తులసేంద్ర డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హనుమాన్‌పేటలో దాసరి భవన్‌లో ఆదివారం జరిగింది.

11/07/2016 - 02:43

నంద్యాల, నవంబర్ 6 : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని, మావోయిస్టుల కదలికలు లేవని, ఎన్‌కౌంటర్ జరిగింది ఒడిస్సా రాష్ట్రంలోనేనని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు దినం ప్రకటిస్తున్నామని, అయితే కొత్త నియామకాలు పూర్తి చేసిన అనంతరం వారికి ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు.

11/07/2016 - 02:41

అనంతపురం సిటీ, నవంబర్ 6 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్‌సి) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(ఏఇఇ) ఉద్యోగాల నియామకానికి ఆదివారం నిర్వహించిన పరీక్షలో ఒకింత గందరగోళం ఏర్పడింది.

11/07/2016 - 02:39

చిలకలూరిపేట, నవంబర్ 6: బీచ్ ఫెస్టివల్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన బూటకపు ఆరోపణలు మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పలు వార్డుల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.

Pages