S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/07/2016 - 02:41

హైదరాబాద్, అక్టోబర్ 6: తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేసిన రోజున తొలి ఐదు సంతకాల్లో ఉన్న బెల్ట్‌షాపుల రద్దు ఆచరణలో విఫలమైందని వైకాపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

10/06/2016 - 08:13

గుంటూరు, అక్టోబర్ 5: వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజ మెత్తారు. బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రకటించి ముఖ్యమంత్రి, మంత్రులు చేతులు దులుపుకుంటున్నారని, రైతులకు ఏ మాత్రం అందలేదన్నారు.

10/06/2016 - 08:12

మొగల్తూరు, అక్టోబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లోబుధవారం సముద్రం స్నానం చేస్తూ, అలల తాకిడికి నీట మునిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మొగల్తూరు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి... భీమవరం ప్రాంతానికి చెందిన 12మంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు.

10/06/2016 - 08:11

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బి)లో అక్రమ పదోన్నతులు ఆ శాఖను కుదిపేస్తున్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పించడం కలకలం రేపుతోంది. జోన్లవారీగా సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఆదేశాలను తుంగలోతొక్కి, యథేచ్ఛగా అక్రమ పదోన్నతులు కల్పించారని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

10/06/2016 - 08:11

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 5: భవన నిర్మాణం కోసం తవ్విన గోతులు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొన్నాయి. మరో బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

10/06/2016 - 08:10

శ్రీశైలం, అక్టోబర్ 5: శ్రీశైలం శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు శేషవాహన సేవ నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శ్రీచక్రనవవర్ణ పూజలు, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగం, జపాలు, పారాయణాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

10/06/2016 - 08:09

కడప, అక్టోబర్ 5: మరో రెండేళ్లు ఓపిక పట్టండి.. ఆ తరువాత .అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల, జమ్మలమడుగులో బుధవారం జగన్ పర్యటించారు. పార్టీ కార్యలయాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు.

10/06/2016 - 08:06

విజయవాడ, అక్టోబర్ 5: ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఐదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి బుధవారం దుర్గమ్మ శ్రీ కాత్యాయని దేవిగా భక్తకోటికి దర్శమిచ్చింది. పురాణ కాలంలో మహిషాసురుడుని అంతమొందించేందుకు ముక్కోటి దేవతలు , త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవిగా శక్తిని ప్రసాదించి లోక కల్యాణం కావించారు.

10/06/2016 - 07:43

హైదరాబాద్, అక్టోబర్ 5: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరులో జరుగుతున్న తెదేపా శిక్షణ శిబిరాల రెండోరోజు కార్యక్రమానికీ గైర్హాజరవడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమయింది. దీనిపై సోషల్‌మీడియా, పార్టీ వ్యతిరేక మీడియాల్లో రకరకాల కథనాలు రావడమే దానికి కారణం. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగి, శిక్షణ శిబిరాలకు డుమ్మా కొట్టారని తీవ్రస్థాయి ప్రచారం జరిగింది.

10/06/2016 - 07:42

హైదరాబాద్, అక్టోబర్ 5: గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాల్లో అత్యధికంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంపికయ్యారని వర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐటి కోర్ సెక్టార్‌కు చెందిన బడా కార్పొరేట్లు బహుళ జాతి సంస్థలు గీతం ప్రాంగణ నియామకాలు నిర్వహించి, ఏడో సెమిస్టర్ కంటే ముందే సెప్టెంబర్ నాటికే 473 మంది ఎంపికయ్యారు.

Pages