S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/05/2016 - 07:56

హైదరాబాద్, అక్టోబర్ 4: ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్యనాయుడుకు జరుగుతున్న సన్మాన కార్యక్రమాలకు తమ నేతలు హాజరవడంపై తెదేపా ప్రజాప్రతినిధుల్లో ఆక్షేపణ వ్యక్తమవుతోంది. మంగళవారం నుంచి కేఎల్ యూనివర్శిటీలో ప్రారంభమైన తెదేపా వర్క్‌షాప్‌లో జరిగిన చర్చల్లో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యే, ఎంపి, నియోజకవర్గ ఇంచార్జిలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.

10/05/2016 - 07:45

విశాఖపట్నం, అక్టోబర్ 4: ప్రభుత్వ ఆదాయ వనరులు మెరుగు పడలేదు. ప్రభుత్వ ఖజానాపై ఇప్పటికీ లోటు కనిపిస్తునే ఉంది. అయితే, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ప్రజావసరాలను దృష్టిలోపెట్టుకుని కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించాల్సి ఉంది. నిధులు లేవన్న సాకుతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టకపోతే, ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది.

10/05/2016 - 06:01

నెల్లూరు రూరల్, అక్టోబర్ 4: అతను మూడు పదులు దాటిన యువకుడు... రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన బాధితుడు... అతను బతకడం దుర్లభమని తెలిసినా... అంతటి దుఃఖంలోనూ అతని కుటుంబ సభ్యులు మానవత్వానికే పెద్దపీట వేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సాక్షీభూతంగా నిలిచారు. అతని ఐదు కీలక అవయవాలు ఐదు ప్రాంతాలకు వెళ్లి మరో ఐదు కుటుంబాలకు జీవం పోశాయి. వివరాలిలా ఉన్నాయి.

10/05/2016 - 05:55

విజయవాడ, అక్టోబర్ 4: ‘ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదాపైనే చర్చ జరుగుతోంది. అయితే మనం ఇచ్చింది తీసుకుందాం.. ఆపై హక్కుగా రావాల్సిన దానికోసం పోరాడదాం.. విపక్షాలు మాత్రం ప్యాకేజీ వద్దు.. హోదానే కావాలంటూ సొంత పైత్యాలతో ఆందోళన చేస్తున్నాయి. అసలు వారికి హోదాపై అవగాహన లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పరిశ్రమలు రావటానికి రాయితీలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

10/05/2016 - 05:51

హైదరాబాద్, అక్టోబర్ 4: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాపుపెద్దల నుంచి మద్దతు, ఆమోదముద్ర లభించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నియోజకవర్గం నుంచి ముద్రగడ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో కాపునాడు జాక్ కీలకభేటీ వాడి వేడిగా జరిగింది.

10/05/2016 - 05:46

విజయవాడ (రైల్వేస్టేషన్), అక్టోబర్ 4: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాట్‌ఫారం టికెట్ ధరను 20 రూపాయలకు పెంచారు. శరన్నవరాత్రులకు ఇక్కడి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకోడానికి వచ్చే భక్తులకు వీడ్కోలు పలకడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.

10/05/2016 - 01:49

అనంతపురం, అక్టోబర్ 4: కరవు కోరల్లో చిక్కి అనంత రైతాంగం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలతో కపట నాటకాలు అడుతున్నారని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నిలువునా ఎండిపోతున్నా తనకు తెలీదని, ఎవరూ చెప్పలేదంటూ, రెయిన్‌గన్ల సినిమా మొదలు పెట్టారని విమర్శించారు.

10/05/2016 - 01:48

శ్రీశైలం, అక్టోబర్ 4: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ దేవి అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మల్లన్నస్వామి, అమ్మవారికి కైలాస వాహనసేవ నిర్వహించారు. ఉదయం, సాయంత్రం అమ్మవారు, స్వామికి ప్రత్యేక పూజలను అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

10/05/2016 - 01:44

నాగార్జున యూనివర్సిటీ, అక్టోబర్ 4: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్స్ మెస్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారపదార్థాలు పెడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. వర్సిటీ హాస్టల్స్‌లోని అన్ని మెస్‌లకు తాళాలు వేసి విద్యార్థులు హాస్టల్స్ వద్ద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

10/05/2016 - 01:40

రాజమహేంద్రవరం, అక్టోబర్ 4: ఉభయ గోదావరి జిల్లాల్లో వివిధ సాగునీటి ప్రాజెక్టుల కారణంగా ఎప్పటికి ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారో ఇంకా స్పష్టం కానప్పటికీ, మూడు ప్రాజెక్టుల కారణంగా ప్రస్తుతం సుమారు పది వేల ఎకరాల భూమి మాత్రం నిష్ఫలంగా మారింది. పోలవరం, పుష్కర ఎత్తిపోతల, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కాలువలు సమాంతరంగా వెళ్లడంతో ఈ కాలువల మధ్య ప్రభుత్వం సేకరించిన భూమి నిరుపయోగంగా బీడుపడింది.

Pages