S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/23/2016 - 04:11

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌చాలెంజ్ విధానంపై హైకోర్టు గురువారం కేసును విచారించింది.

09/23/2016 - 04:10

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఇంధన పొదుపు కార్యక్రమానికి ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి తెలిపారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.

09/23/2016 - 04:09

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా రాష్ట్రంలో పరిపాలనా విధ్వంసానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలే దండయాత్ర చేసే రోజులు సమీపించాయని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు వందల హామీలను ఇచ్చిన చంద్రబాబు కాపులను, రైతులను మోసం చేశారన్నారు.

09/23/2016 - 04:07

విజయవాడ, సెప్టెంబర్ 22: ‘నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నాకు రహస్య ఎజెండా ఏదీ లేదు. వితండవాదం అంతకన్నా లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన ముందున్నది ఒక్కటే లక్ష్యమన్నారు. హోదాకు సమానంగా ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కావాలి, అందుకు అవసరమైన జీవోలు ఇవ్వాలి, అన్నీ రిలీజ్ చేయాలి, ఇదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

09/23/2016 - 02:50

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం గురువారం మరింత బలపడింది. వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురుస్తుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

09/23/2016 - 02:47

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాల వల్ల ఏర్పడే ఎటువంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు సన్నద్ధమై వుండాల్సిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన వీలైనంతవరకూ ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.

09/23/2016 - 02:39

గుంటూరు, సెప్టెంబర్ 22: ఒకవైపు జోరువాన.. మరోవైపు ముంచెత్తిన వరదనీరు.. కుటుంబసభ్యులతో పాటు వరదనీటిలో కొట్టుకుపోతున్న అతనికి తాటిచెట్టే జీవనాధారమైంది. అదే అదనుగా చెట్టుపైకి ఎక్కి దాదాపు 8 గంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి మృత్యుంజయుడుగా నిలిచాడు..

09/23/2016 - 02:36

ఏలూరు, సెప్టెంబర్ 22: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, యువతరానికి ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదా అత్యవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగిస్తామని, దీనికి యువతరం కలసిరావాలని పిలుపునిచ్చారు.

09/22/2016 - 16:24

గుంటూరు : వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్రోసూరు మండలంలో గురువారం వూటుకూరు వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. అధికారులు తొలుత హెలికాప్టర్‌ సాయంతో బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే స్థానికుల సాయంతో తాడు ద్వారా వారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

09/22/2016 - 16:17

విజయవాడ : విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. అక్టోబర్‌ 3 నుంచి అమరావతి నుంచే పాలన, రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ ఎంపిక వ్యవహారం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై కేసు తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
చర్చించనున్నట్లు సమాచారం.

Pages