S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/22/2016 - 08:46

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం రాత్రి ప్రకటించింది. దీనికి సమాంతరంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా తెలంగాణ ప్రాంతానికి విస్తరించనుంది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

09/22/2016 - 08:29

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పెద్ద ఎత్తున వర్షాలు ముంచెత్తాయి. ఒక్క కడప జిల్లాలోనే గత 24 గంటల్లో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం రాత్రి మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంతో పాటు, పలు ప్రాంతాల్లో ఏరులు పొంగి పొర్లుతున్నాయి.

09/22/2016 - 08:20

గుంటూరు, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రజలతో మమేకం కావాలని అధిష్ఠానం పార్టీశ్రేణులకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు దేశంలోనే ఏ పార్టీకి లేని బలం టిడిపికి ఉంది.

09/22/2016 - 08:17

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది. ఇందులో ప్రధానంగా బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో జరిగిన చర్చలు, నిర్ణయాలు పై చర్చ జరగనుంది. భవిష్యత్‌లో కృష్ణాజలాల పరిరక్షణపై పంటల పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష జరుగుతుంది.

09/21/2016 - 14:06

గుంటూరు: రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో బుధవారం లోకేష్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. పార్టీ సభ్యత్వ నమోదు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పార్టీలో చేరికలపై ప్రధానంగా చర్చించనున్నారు.

09/21/2016 - 14:03

గుంటూరు: కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ప్రభుత్వం, మంజునాథ కమిషన్‌ వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోందని, స్మార్ట్‌ సర్వేలో కాపులను లెక్కించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని జిల్లా కాపు జేఏసీ ఆరోపించింది. మంజునాథ కమిషన్‌ కాపులు, బీసీలను వేర్వేరుగా పిలిచి మాట్లాడాలని జిల్లా కాపు జేఏసీ డిమాండ్ చేసింది.

09/21/2016 - 14:01

తిరుపతి: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ గుణశేఖర్‌ను టాస్క్‌ఫోర్స్ బుధవారం అరెస్ట్ చేసింది. దాదాపు 200 టన్నుల ఎర్రచందనాన్నిగుణశేఖర్‌ తరలించినట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మడిపూడి మాజీ ఎమ్మెల్యే వేణుకు గుణశేఖర్ ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ముతో రాజకీయంగా ఎదిగేందుకు గుణశేఖర్ యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

09/21/2016 - 11:58

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నర్సన్నపేట, శ్రీకాకుళం మండలాల్లో బుధవారం భారీ వర్షం పడింది.

09/21/2016 - 06:25

ఆదోని, సెప్టెంబర్ 20: కర్నాటకలోని తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయకట్టు రైతుల పరిస్థితి ఈసారి మరీ అధ్వాన్నంగా తయారైంది. జలాశయానికి ఈసారి 50 టిఎంసిల నీరు మాత్రమే వచ్చి చేరింది. తుంగభద్ర జలాశయం చరిత్రలో ఇంత తక్కువ పరిణామంలో వరద నీరు రావడం ఇదే మొదటిసారి. జలాశయంలో అనుకున్న మేరకు నీరు లేకపోవడంతో 10 రోజులకు ఒక్కసారి తుంగభద్ర కాల్వలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు.

09/21/2016 - 06:25

విజయవాడ, సెప్టెంబర్ 20: ప్రపంచ వ్యాప్తంగా పరిపాలన తీరుతెన్నులు మారుతున్నాయి. నియంత్రించే విధానం నుంచి సాధికారిత కల్పించే దిశగా పాలనా విధానాలు మార్పుకు లోనవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలిగించేలా పాలనాపరమైన సంస్కరణలకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Pages