S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/16/2016 - 07:20

గుంటూరు, సెప్టెంబర్ 15: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి భద్రత పెరగనుంది. ఈ కార్యాలయం శుక్రవారం నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధీనంలోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీఎఫ్ డిజి మాదిరెడ్డి ప్రతాప్, డిఐజి ఏసురత్నం, కమాండెంట్ డాక్టర్ కెఎన్ రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయనున్నారు.

09/16/2016 - 07:18

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ఏర్పాటులో అంతులేని జాప్యం జరుగుతోంది. రాజధాని నిర్మాణం కృష్ణా, గుంటూరు జిల్లా మధ్య జరుగుతున్నందున విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్టేర్ డివిజన్‌లతో విశాఖపట్టం కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయటానికి అక్కడి ఎంపి కంభంపాటి హరిబాబు ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

09/16/2016 - 07:05

తిరుపతి, సెప్టెంబర్ 15: రైతులకు ఆర్థిక స్వావలంబన సహజసిద్ధమైన వ్యవసాయ విధానంతోనే సాధ్యమని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. తిరుపతి గత నాలుగు రోజులుగా జరుగుతున్న సహజసిద్ధమైన వ్యవసాయ శిక్షణా తరగతులుల ముగిసిన అనంతరం గురువారం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 75లక్షల హెక్టార్లలో రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నారు.

09/16/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ఇంధన సంరక్షణ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఏపి ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర రెడ్డిని మీడియా సలహాదారుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధాని ప్రాంతం (సిఆర్‌డిఏ), వౌలిక సదుపాయాలు, ఇంధనం, పెట్టుబడులు, ఫైబర్‌నెట్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, గ్యాస్ తదితర శాఖల మీడియా సలహాదారుగా ఆయన విధులు నిర్వహిస్తారు.

09/16/2016 - 06:59

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షలన్నీ ఇక మీదట ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సన్నద్ధంగా వివిధ ప్రవేశ పరీక్షల నిపుణుల కమిటీలతో ప్రభుత్వం శుక్రవారం నాడు సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

09/16/2016 - 05:20

విజయవాడ, సెప్టెంబరు 15:రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానన్న భరోసాతో ప్రజలు తనకు పట్టం కట్టారని, ఎవరైనా అభివృద్ధికి అడ్డుతగిలితే తోక కట్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా రు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అతని కుమారుడు అవినాష్, కడియాల బుచ్చిబాబు గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

09/16/2016 - 05:18

గుంటూరు, సెప్టెంబర్ 15: సచివాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం.. త్వరలో ఇక్కడి నుంచే పాలన సాగిస్తాం..నెలాఖరులోగా ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది.. ఇక పారదర్శక పాలన అందించటమే తక్షణ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. గురువారం వెలగపూడిలో సచివాలయ భవన నిర్మాణ పనులను సిఎం పరిశీలించారు. ఒకటి, ఐదో బ్లాక్‌లో పనులపై ఆరాతీసి పలు సూచనలు చేశారు.

09/16/2016 - 05:11

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: స్మార్ట్ సిటీల నిర్మాణంలో మానవీయ కోణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని బ్రిక్స్ దేశాల సదస్సు పిలుపునిచ్చింది. సామాజిక వెలికి స్వస్తి పలికి సమీకృత అభివృద్ధే స్మార్ట్ సిటీల లక్ష్యం కావాలని పేర్కొంది. ఇందుకు టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ అదే సామాజిక లక్ష్య సాధనంకు అంతిమం కాదని బ్రిక్స్ దేశాలకు చెందిన పట్టణీకరణ నిపుణులు స్పష్టం చేశారు.

09/15/2016 - 17:16

విజయవాడ: వైద్యవిద్యలో కార్డియాలజీ అంటే తనకెంతో ఇష్టమని, కార్డియాలజిస్టుగా సేవలందించడమే తన లక్ష్యమని తెలంగాణ ఎంసెట్-3లో ఫస్ట్‌ర్యాంకు సాధించిన మానస తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారంతోనే తాను ఇంతటి ఘనతను సాధించానని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో తెలిపింది.

09/15/2016 - 17:00

విజయవాడ : మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సాలూరులో గంటపాటు భారీవర్షం పడింది. విశాఖపట్నంలోని కోట ఉరట్లలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదుకాగా, పూసపాటిరేగ, భోగాపురంలో 4 నుంచి 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది.

Pages