S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/15/2016 - 16:58

విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ కల్లా అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఆయన గురువారం సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసెంబ్లీ, శాసనమండలి భవనాల ప్లానింగ్ అధికారులతో వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు.

09/15/2016 - 16:52

విశాఖ : విశాఖలో రెండో రోజు బ్రిక్స్ సదస్సు గురువారం ప్రారంభమైంది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక వనరుల సమీకరణపై సదస్సులో చర్చించనున్నారు. బ్రిక్స్ దేశాల్లో స్మార్ట్ సిటీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

09/15/2016 - 16:42

విజయవాడ: 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో ఇకపై ప్రతి సోమవారాన్ని ‘పోలవారం’గా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళిని అనుసంధానం చేస్తామన్నారు.

09/15/2016 - 16:08

విశాఖ: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ- కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం వెల్లడించారు. ‘పురసేవ’ యాప్‌ ద్వారా ప్రజా సేవలను మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం నుంచి 110 మున్సిపాలిటీల కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు.

09/15/2016 - 15:43

హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

09/15/2016 - 15:32

శ్రీకాకుళం: : వంగర మండల పరిధిలోని మద్దువలస జలాశయం నుంచి గురువారం నాలుగు గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేసినట్లు జలాశయం డీఈ పద్మజ తెలిపారు. జలాశయంలోకి స్వర్ణముఖి, వేగావతి నదుల ద్వారా 6వేల క్యూసెక్కుల నీరు రావడంతో ప్రస్తుతం జలాశయ నీటి మట్టం 63.9మీటర్లుగా నమోదైనట్లు తెలిపారు. ప్రాజెక్టు దిగువ భాగంలోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని డీఈ సూచించారు.

09/15/2016 - 15:29

కర్నూలు : మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో గురువారం 60 కేజీల బంగారంతో తయారుచేసిన మండపాన్ని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఇకపై మఠంలో మూల రాములను స్వర్ణ మండపంలో ఉంచి నిత్య పూజలు చేయనున్నారు.

09/15/2016 - 15:23

కడప : కడప జిల్లా బద్వేలులో గురువారం ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 14 మంది తమిళ కూలీలను ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు అరెస్ట్‌ చేశారు. లక్కవారిపల్లె ప్రాంతంలో తమిళకూలీలు ఎర్రచందనం చెట్లను నరికి దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

09/15/2016 - 13:52

ఏలూరు : కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భాస్కర్‌ను మాలమహానాడు సభ్యులు గురువారం నిర్భందించారు. పోలవరం నిర్వాసితులకు చెల్లించే పరిహారం విషయంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు భూములకు కాకుండా ముందుగా ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరినట్లు మాలమహానాడు సభ్యులు తెలిపారు. అలా జరగని పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

09/15/2016 - 13:17

గుంటూరు: ఓ మహిళా డాక్టర్‌ను సస్పెండ్ చేసినందుకు నిరసనగా గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం ఉదయం వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్‌ను ఎతివేసే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విభాగాల్లో వైద్యసిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Pages