S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/14/2016 - 12:12

కాకినాడ: వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ జయంతి సభను నిర్వహించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆలమూరు మండలం గుమ్ములూరులో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ఇరువర్గాలకు చెందిన కొందరు గాయపడ్డారు.

04/14/2016 - 12:11

విజయవాడ: ఎపిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని సిఎం ప్రకటించారు. జక్కంపూడిలో పదివేల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తూ, గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

04/14/2016 - 12:10

కడప: వేంపల్లిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. మేనేజర్ గదిలో ఫర్నిచర్, కంప్యూటర్ కాలిపోయినట్లు, సుమారు 5 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు.

04/14/2016 - 07:59

కడప, ఏప్రిల్ 13: ఆర్టీపిపి (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)ని నీటి సమస్య వెంటాడుతోంది. తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, మైలవరం ప్రాజెక్టుల నీటి వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఆ ప్రాజెక్టుల సమీపంలోని ప్రజలకు సాగునీరు మాటలావుంచి తాగునీరే గగనంగా మారింది. గతంలో ఆర్టీపిపికి బొగ్గుకష్టాలు ఉండగా, బొగ్గు కొరత పరిష్కారమై ఇప్పుడు నీటి కష్టాలు మొదలయ్యాయి.

04/14/2016 - 07:57

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 13: రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. వడగాలులతో పాదచారులు, ద్విచక్రవాహనాలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఉక్కిరి బిక్కిరవువుతున్నారు.

04/14/2016 - 07:57

ఆత్మకూరు, ఏప్రిల్ 13: ఏడు నెలల గర్భవతికి హటాత్తుగా గర్భం మాయమయింది. దేవుడే తన గర్భాన్ని తీసుకెళాల్డని, తిరిగి మూడు నెలల తరువాత ఇస్తాడని ఆ మహిళ చెబుతుండగా, ఇదంతా దైవ మహిమ అంటూ ఆమెను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. గ్రామ సర్పంచ్ నరసింహులు, ఆమె భర్త పోలన్న తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా అత్మకూరు మండల పరిధిలోని సింగంపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ (35) ఏడు నెలల గర్భవతి.

04/14/2016 - 07:34

విజయవాడ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులు ఈ కమిషన్‌లో ఉంటారు. ఈ సందర్భంగా కారెం శివాజీ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ పదవిని ఏ రాజకీయ నాయకునికి ఇవ్వకుండా ఒక దళితునికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు.

04/14/2016 - 04:35

చింతూరు/ఏలూరు , ఏప్రిల్ 13: నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనలో భాగం గా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో బుధవారం పర్యటించిన అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో బుధవారం సిఎం పర్యటించారు.

04/14/2016 - 04:29

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అందరికి గృహాలు అన్న పథకం పేరుతో రాష్ట్రంలో ఆరు లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి గృహాలు నిర్మించనున్నారు.

04/13/2016 - 18:15

కాకినాడ: తెలంగాణ నుంచి ఎపిలో విలీనమైన మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా బుధవారం పర్యటించి గిరిజనులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చింతూరులో ఆయన అంగన్‌వాడీ కేంద్రాన్ని, ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి మట్టితట్టలను తలపైకి ఎత్తుకున్నారు. సబ్-ట్రెజరీ ఆఫీసును ప్రారంభించాక, గ్రామంలో పెట్రోల్ బంకు, ఎల్‌పిజి సిలిండర్ల గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Pages