S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/14/2016 - 05:18

విజయవాడ, సెప్టెంబర్ 13: ప్రజారోగ్యం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా మాతా శిశు మరణాలు నిరోధించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు విజయవంతమవుతున్నాయి. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మాతా శిశు మరణాలు రాష్ట్భ్రావృద్ధిపై దుష్ప్రభావం చూపుతున్నాయి.

09/14/2016 - 05:17

విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 13: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి 50 కిమీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాలు, మఠాలు తదితర వాటిని దుర్గగుడి ఆధీనంలోకి తీసుకువచ్చే విధంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో తయారు చేస్తున్నట్టు తెలిసింది. స్వాధీనం చేసుకునే ఆలయాల్లో సిబ్బందిని వారి కేడర్‌ను బట్టి దుర్గ గుడిలో వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

09/14/2016 - 05:15

నెల్లూరు, సెప్టెంబర్ 13: నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటన తాలుకూ భయాందోళన నగర వాసుల్ని వీడలేదు. గతంలో ఎన్నడూ నెల్లూరు జిల్లాలో ఈ తరహా పేలుడు సంభవించిన దాఖలాలు లేవు. చాలా తక్కువ స్థాయి పేలుడు జరిగిందని, బాంబు సామర్థ్యం కూడా కొద్దిపాటిదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ వైపు జిల్లా పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికి నగరవాసుల్లో మాత్రం వణుకు పోలేదు.

09/14/2016 - 02:46

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఆంధ్ర రాష్ట్రం అంతా మూడు మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది.

09/14/2016 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలయిన ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు ఆ పార్టీకి కుల సంకటంగా పరిణమించాయి. కాపు రిజర్వేషన్లపై కాపు వర్గం, దానిని వ్యతిరేకిస్తున్న బీసీల కుల సమీకరణతో క్యాబినెట్ కూర్పు క్లిష్టంగా మారుతోంది. కాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకోవలసిన అనివార్య పరిస్థితి పార్టీకి ఏర్పడింది.

09/14/2016 - 02:43

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన స్విస్ చాలెంజ్‌పై బహిరంగ ప్రకటన చేయాలని వైకాపా డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 58 కంపెనీలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు.

09/14/2016 - 02:42

ఏలూరు, సెప్టెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన, ఆధునాతన యంత్రాల ప్రారంభోత్సవానికి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుప్రయాణంలో రోడ్డుమార్గాన విజయవాడకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతం పరిశీలన, యంత్రాల ప్రారంభం, విలేఖరుల సమావేశం, అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలతో సమీక్ష నిర్వహించారు.

09/14/2016 - 02:41

హైదరాబాద్, సెప్టెంబర్ 13: దేశంలో గుజరాత్ తర్వాత వంద శాతం విద్యుత్‌ను సరఫరా చేసే స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని, రాష్ట్రంలో ఇంధన రంగాన్ని పటిష్ఠం చేసేందుకు రెండు వేల కోట్లరూపాయలతో ప్రణాళిక ఖరారు చేయనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ లోటు నుంచి మిగులు దశకు చేరుకున్నామని ఆయన చెప్పారు.

09/14/2016 - 02:07

విజయవాడ, సెప్టెంబర్ 13: సాగర్ నీటి కష్టాలు మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగర్ నీటిని నమ్ముకుని ఏర్పాటు చేసిన 18 హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు నేడు కొన ఊపిరితో మిగిలి ఉన్నాయి. సాగర్ నుంచి నీరు విడుదల కాక, విద్యుత్ ఉత్పత్తి కాక తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి.

09/14/2016 - 02:04

తెనాలి, సెప్టెంబర్ 13: గోవుమాంసాన్ని ప్రత్యేక వాహనంలో స్థానిక చినరావూరుతోట వైపు తరలిస్తున్న సమయంలో ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూపరిషత్ సభ్యులు వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్, వాహనంలో ఉన్న మాసంతోసహా పోలీసులకు అప్పగించిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం చోటుచేసుకుంది.

Pages