S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/14/2016 - 01:48

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 13: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడువద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టరును వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి ఆందోళనకరంగావుంది.

09/14/2016 - 01:51

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం కకావికలమైంది. గుంటూరు జిల్లా పల్లెగుంత వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. నడికుడి-పిడుగురాళ్ల మధ్య ట్రాక్‌పైకి నీరు చేరింది. రెంటచింతలలో గోలివాగు ఉద్ధృతికి ఇళ్లలోకి నీరు చేరింది. దాచేపల్లి సమీపంలో నాగులేరు వాగు పొంగడంతో హైదరాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి.

09/14/2016 - 01:07

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కనుగొనే దిశగా బ్రిక్స్ దేశాల సదస్సు విశాఖ వేదికగా బుధవారం ప్రారంభం అవుతోంది. బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సదస్సు మూడు రోజుల పాటు జరుగుతుంది.

09/14/2016 - 01:06

విజయవాడ, సెప్టెంబరు 13: ఏపి తాత్కాలిక సచివాలయంలో వచ్చే వారం నుంచి పూర్తి స్థాయి పాలన సాగుతుందని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. మంగళవారం ఆయన వెలగపూడిలోని సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మంత్రుల ఛాంబర్లు అన్నీ ప్రారంభమయ్యాయని, వచ్చే వారం నుంచి మంత్రులంతా ఇక్కడే ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రి ఛాంబర్ నెలాఖరుకు, లేదా వచ్చే నెల మొదటి వారంలో సిద్ధమవుతుందన్నారు.

09/14/2016 - 01:05

ఏలూరు, సెప్టెంబర్ 13: ప్రత్యేక హోదాకు సమానంగా వచ్చే అన్ని వనరులను అయిదేళ్లపాటు ప్యాకేజీ రూపంలో అందించేందుకు కేంద్రం అంగీకరింనందుకు ఏపి సిఎం చంద్రబాబు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాను ఉదయమే ప్రధానికి ఫోన్ చేసి థాంక్స్ చెప్పినట్టు ముఖ్యమంత్రి స్వయంగా విలేఖరులకు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించి అనంతర చర్యలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరానన్నారు.

09/14/2016 - 01:53

ఏలూరు, సెప్టెంబర్ 13: పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి జలభద్రత చేకూరుతుందని, ఈ ప్రాజెక్టును 2018 వర్షాకాలం నాటికి పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని ప్రతి సోమవారం కెమెరాల ద్వారా పరిశీలించి, సమీక్షిస్తానని, ప్రతి నెల మూడో సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

09/13/2016 - 17:15

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం నుంచి 4రోజులపాటు ప్రవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 12.30గంటలకు అమ్మవారికి మహా నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి 15న ఉదయం 9గంటలకు పనాభిషేకం అనంతరం ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్న సమయంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పండితులు తెలిపారు.

09/13/2016 - 17:09

గుంటూరు: అప్పుడే పుట్టిన శిశువు బతికే ఉన్నా.. మరణించినట్లు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు చెప్పడం వివాదాస్పదమైంది. గుంటూరు శివారు ప్రాంతానికి చెందిన ఓ మహిళ మంగళవారం ఉదయం జిజిహెచ్‌లో ప్రసవించగా శిశువు మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే, కొంతసేపటికి శిశువులో కదలిక రావడంతో బాలింత బంధువులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.

09/13/2016 - 17:06

గుంటూరు: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వారికి సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వరద పరిస్థితిపై అదికారులతో సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

09/13/2016 - 16:47

గుంటూరు: పల్నాడు ప్రాంతంలో మంగళవారం నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యరపతినేని సత్వర చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలతో వరదలో చిక్కుకున్న ప్రజల కోసం ఎమ్మెల్యే పడవలను ఏర్పాటు చేశారు.

Pages