S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/13/2016 - 16:23

విశాఖ: ఐదు దేశాల బ్రిక్స్‌ సదస్సు బుధవారం నుంచి నగరంలో జరగనుంది. బ్రిక్స్‌లో భాగస్వామ్య దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. తొలిరోజు సదస్సులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.

09/13/2016 - 15:55

విజయవాడ: పులిచింతల ప్రాజెక్టులోకి 1,30,555 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 12,234 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేశారు. కృష్ణా, గుంటూరు, నల్గొండ కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేయించేయించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 17.7 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.

09/13/2016 - 15:46

పోలవరం: ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనాలు సమకూరుతాయో అంతే సమానమైన ప్రయోజనాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు, ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు నిధులు ఇస్తామని చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

09/13/2016 - 15:43

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని స్థిరంగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

09/13/2016 - 14:01

ఏలూరు: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామానికి చేరుకున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ ద్వారా ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులిస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సిఎం పోలవరం వచ్చారు. ప్రాజెక్టు పనుల్లో వినియోగించేందుకు తెప్పించిన ఆధునిక యంత్రాలను ఆయన ప్రారంభించారు.

09/13/2016 - 13:14

విజయవాడ: నెలాఖరులోగా కొత్తగా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికెషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ మంగళవారం చెప్పారు. బుధవారం జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

09/13/2016 - 13:11

తిరుపతి: కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో వామపక్షాల నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులపై విపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై వామపక్ష నేతలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.

09/13/2016 - 11:56

విజయవాడ: నీటి సంక్షోభం దుష్పలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలని, ఏపీలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదని నీరు-ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

09/13/2016 - 11:22

విశాఖ: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

09/13/2016 - 11:17

గుంటూరు : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో మంగళవారం జనజీవనం స్తంభించింది. దాచేపల్లి మండలం కరాలపాడులో రాత్రి నుంచి కురిసిన వర్షానికి గోడ కూలి మహిళ మృతిచెందింది. గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. గురజాల-మాచర్ల-రేపల్లె మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ జలమయమైంది.

Pages