S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/13/2016 - 10:53

గుంటూరు : భారీ వర్షాల కారణంగా గురజాలలోని దండి వాగు ఉద్ధృతికి మంగళవారం మాచర్ల-గుంటూరు రైల్వే ట్రాక్‌ అర కిలోమీటరు మేర కొట్టుకు పోయింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ రైలును నిలిపి వేశారు. వరద ఉద్ధృతికి గురజాలలోని వెంకట్రావ్‌నగర్‌ కాలనీ జలమయమైంది.

09/13/2016 - 05:12

గుంటూరు, సెప్టెంబర్ 12: కృష్ణాడెల్టాకు వరప్రదాయిని అయిన బహుళార్ధసాధక ప్రాజెక్టు పులిచింతల నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ నిర్వాసితులకు పునరావాస చర్యలు కొలిక్కిరాలేదు.. అసైన్డు భూములకు చెల్లింపు విషయంలో తెలంగాణలోని ముంపు గ్రామాలకు ఒక నిబంధన.. ఏపి గ్రామాలకు మరో రకమైన రూల్స్ విధించటంతో ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది..

09/13/2016 - 05:10

గుడిపాల, సెప్టెంబర్ 12: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండల పరిధిలో 189-కొత్తపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్(60) మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, 1985-89 మధ్య ఎమ్మెల్యేగా, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసిన గోపీనాథ్ సోమవారం వేలూరు నుంచి చిత్తూరు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఈచర్ వాహనం ఢీకొంది.

09/13/2016 - 05:09

ఆదోని, సెప్టెంబర్ 12: రాయలసీమకు ప్రధాన నీటి వనరుగా ఉన్న తుంగభద్ర జలాశయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలోనే నీరు గణనీయంగా తగ్గిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. దీంతో జలాశయంలో నిల్వ ఉన్న నీటిపై కర్నాటక ప్రభుత్వం, రైతులు కనే్నశారు. ఆ నీటిని వాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సోమవారం తుంగభద్ర ప్రాజెక్టులో 43.604 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

09/13/2016 - 05:08

శ్రీశైలం, సెప్టెంబర్ 12: శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిత్యం సాయంత్రం పూట అల్పాహార అందించే కార్యక్రమాన్ని ఇఓ నారాయణ భరత్‌గుప్తా సోమవారం ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళ, బుధ, గురువారాల్లో 2 వేల మందికి, శని, ఆది, సోమవారాల్లో 3 వేల మందికి నిత్యం అన్న ప్రసాద వితరణ ఉదయం 9 గంటల నుంచి జరుగుతోంది.

09/13/2016 - 05:06

విజయవాడ, సెప్టెంబర్ 12: ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఒనగూడే ప్రయోజనాలపై పవన్ కల్యాణ్‌పై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు శాసనసభలో చీఫ్ విప్, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సవాల్ విసిరారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం విలేఖరుల సమావేశం జరిగింది. సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికిబిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

09/13/2016 - 05:04

విజయవాడ, సెప్టెంబర్ 12: రాజధాని అమరావతిలో ప్రజా రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని పురపాలక మంత్రి, సిఆర్‌డిఎ వైస్‌ఛైర్మన్ నారాయణ చెప్పారు. సోమవారం విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయంలో అమరావతి ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్ మీద జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు.

09/13/2016 - 05:03

మంగళగిరి, సెప్టెంబర్ 12: గుంటూరుజిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులనుంచి సోమవారం పోస్టుద్వారా బెదిరింపులేఖ అందింది. వెంటనే ఆయన లేఖతో మంగళగిరి పోలీసుస్టేషనుకు వెళ్లి సిఐ బ్రహ్మయ్యకు ఫిర్యాదు చేశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. .. రామకృష్ణారెడ్డి ఒళ్లు ఎలా ఉంది.

09/13/2016 - 05:02

ఐరాల, సెప్టెంబర్ 12: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి దేవస్థానం వారు కాకర్లవారిపల్లెకు చెందిన మీనాకుమారి, కాణిపాకంకు చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.

,
09/13/2016 - 04:58

హైదరాబాద్, సెప్టెంబర్ 12: క్రమశిక్షణకు మారుపేరయిన తెలుగుదేశం పార్టీలో చివరకు అది కరవయిపోతోంది. కీలక అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను సీనియర్లే ధిక్కరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్లు ఒకే అంశంపై పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరుకునపెడుతున్నారన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Pages