S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/02/2016 - 05:25

గుంటూరు, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఇన్‌ఫ్లోను నిలిపివేశారు. గురువారం నాటికి 17.2 టిఎంసిల నీరు చేరడంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నల్గొండ, గుంటూరు జిల్లాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి వరద నీరు చేరింది.

09/02/2016 - 05:10

కడప, సెప్టెంబర్ 1: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్మాదిగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారన్నారు. జగన్ ఎత్తులను ప్రజలు గమనిస్తున్నారని, చూస్తూ ఊరుకోరని అన్నారు. కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లె కంచరపల్లె బహిరంగసభలో మాట్లడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు.

09/02/2016 - 05:09

విజయవాడ, సెప్టెంబర్ 1: సరిగ్గా 15 మాసాల తర్వాత ప్రకాశం బ్యారేజీ వద్ద కనిపించిన జలకళ మురిపం సరిగ్గా 24 గంటలు కూడా నిలవలేదు. ఎగువనున్న కట్టలేరు, మునేరు ఇతర వాగులు పొంగి పొరలటం వలన సంభవించిన వరద తాకిడికి బుధవారం ఉదయం 20 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి 15 వేల క్యూసెక్కుల చొప్పున సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. వరద తాకిడి నిలిచిపోవటంతో గురువారం ఉదయం గేట్లన్నీ మూసివేశారు.

09/02/2016 - 05:08

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: పాత ప్రభుత్వాస్పత్రి మరోసారి తెరమీదకు వచ్చింది. కాన్పుల వార్డులో జన్మించిన ఓ బిడ్డ గతంలో మాయమైన సంఘటన మరవకమునుపే మరో వివాదం ఆస్పత్రిని చుట్టుముట్టింది. మృత శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులపై ఆందోళనకు దిగారు. తమ బిడ్డను తారుమారు చేశారంటూ సిబ్బందిపై చిందులు తొక్కారు. బిడ్డను మార్చేసి చనిపోయిన మగ శిశువును అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

09/02/2016 - 05:07

చిత్తూరు, సెప్టెంబర్ 1 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు తెలిపారు. గత మూడు రోజులుగా చిత్తూరు నగరంలో నిర్వహించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ - 2016 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

09/02/2016 - 05:05

విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 1: ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఉన్న హుండీలను శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించగా 4 కోట్ల 99 రూపాయలు లభించాయి. కృష్ణ పుష్కరాల సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన హుండీలను 4 రోజులపాటు ఆలయ సిబ్బంది లెక్కించగా ఈ మేరకు ఆదాయం లభించింది.

09/02/2016 - 05:04

విజయపురి సౌత్, సెప్టెంబర్ 1: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్‌కు గురువారం నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో సాగర్ జలాశయం నీటిమట్టం 513.4 అడుగులకు చేరుకుంది. ఇది 137.5148 టిఎంసిలకు సమానం. హైదరాబాద్ వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 2506 క్యూసెక్కులనీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 817.2 అడుగులకు చేరుకుంది.

09/02/2016 - 05:04

గుంటూరు, సెప్టెంబర్ 1: తుళ్లూరులోని సిఆర్‌డిఎ కార్యాలయం ఎదుట గురువారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాంబాబు అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో స్పందించిన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ఈ విషయమై రైతు రాంబాబు మాట్లాడుతూ తుళ్లూరులో రాజధాని ఏర్పడితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి తనకున్న 47 సెంట్ల భూమిని ప్రభుత్వానికి అప్పగించానని తెలిపారు.

09/02/2016 - 05:03

చిత్తూరు, సెప్టెంబర్ 1: చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండుముఖం పట్టిన వేరుశనగ పంటకు తొలివిడత నీటి సరఫరా రేపటిలోగా పూర్తి చేయనున్నట్లు రేపటి ఇన్‌చార్జి మంత్రి నారాయణ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి జిల్లాలో వేరుశనగ పంటకు నీటి సరఫరా విషయాన్ని సమీక్షించారు. పలువురు రైతులను నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

09/01/2016 - 18:08

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గోవా యాత్రకు వెళ్తున్నారు. ఈనెల 3, 4 తేదీల్లో ఆయన గోవాలో విశ్రాంతి తీసుకుంటారు. 5న వినాయక చవితి పూజల్లో పాల్గొనేందుకు తిరిగి విజయవాడ చేరుకుంటారు.

Pages