S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2016 - 18:07

ఏలూరు: అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ ఘటన గురువారం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య వరలక్ష్మిపై భర్త నరసింహమూర్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చిన అత్తపైనా దాడి చేశాడు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా వరలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.

09/01/2016 - 17:28

చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా కేంద్రం నిధులు ఇస్తుందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఎంపీ హరిబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్రం ఆలోచిస్తోందని అన్నారు.

09/01/2016 - 17:24

విజయవాడ: ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలన్నింటిని కలిపి ఇస్తే- ప్యాకేజీని అంగీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, సాధారణంగా వచ్చే నిధుల మధ్య ఉన్న 30 శాతం నిధుల గ్యాప్‌ను పూడ్చాలని చంద్రబాబు షరతు పెట్టారు. కొద్దిసేపటి క్రితం సీఎంతో జైట్లీ, వెంకయ్య, సుజనా మాట్లాడారు.

09/01/2016 - 16:35

విజయవాడ: విజయవాడ రాజరాజేశ్వరిపేట ఎర్రకట్ట దగ్గర ఆరేళ్ల బాలుడు శ్రీకాంత్‌ డ్రైనేజీలో మంగళవారం పడ్డాడు. తమ కుమారుడు డ్రైనేజీలో గల్లంతవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

09/01/2016 - 15:35

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తనను విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

09/01/2016 - 14:42

విజయవాడ: వినాయక చవితి, ఉపాధ్యాయ దినోత్సవం ఒకేరోజున రావడంతో గురుపూజోత్సవ వేడుకలను ఈనెల 5కు బదులు ఏడో తేదీన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రభుత్వం తరపున ఏడో తేదీన గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

09/01/2016 - 13:49

విజయవాడ: ఈనెల 25, 26 తేదీల్లో మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, బి-కేటగిరిలో డబ్బు కట్టిన వారికి ఏ- కేటగిరిలో సీటు వస్తే మినహాయింపు ఉండదని మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో భవిష్యత్‌లో ఎటువంటి గ్రేస్ మార్కులు ఉండవని మంత్రి తెలిపారు.

09/01/2016 - 13:45

విజయవాడ: విజయవాడ పరిసరాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.50 లక్షల విలువైన 1.6 కేజీల బంగారం, 8.20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

09/01/2016 - 13:40

అనంతపురం: కొన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనందునే నేడు రాయలసీమలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కాంట్రాక్టర్లు ఇకనైనా నిర్లక్ష్యం వీడకుంటే కఠిన చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన గురువారం ఇక్కడ పోలవరంతో పాటు సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తీరుతెన్నులను సమీక్షించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

09/01/2016 - 13:38

విజయవాడ: గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. సమాచారం తెలిశాక గన్నవరం పోలీసులు కళాశాలకు చేరుకుని ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

Pages