S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/31/2016 - 06:51

విజయనగరం, ఆగస్టు 30: కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర, కర్ణాటకలతో ఒప్పందాలు కుదుర్చుకుంటు అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుంటే, అభ్యతరం తెలపవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తున్నారని, జరుగుతున్న అన్యాయంపై నోరు మెదిపే ధైర్యం లేకుండా పోయిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు

08/31/2016 - 07:55

విజయవాడ, ఆగస్టు 30:కాపులను బిసిలుగా గుర్తించటం వలన బిసిలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని అదంతా అపోహలు మాత్రమేనని, అవసరమైతే బిసి రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయగలదని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బిసిల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాలకు చెందిన ఫెడరేషన్‌లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

08/31/2016 - 06:50

విజయవాడ, ఆగస్టు 30: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ, అతని కుమారుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నివాసంలో వీరిద్దరూ చంద్రబాబుని కలుసుకున్నారు. సుమారు గంటసేపు వీరి మధ్య చర్చలు జరిగాయి.

08/31/2016 - 06:49

తిరుపతి, ఆగస్టు 30: తిరుమల టిటిడి కల్యాణకట్టలో నారుూబ్రాహ్మణునిగా పనిచేసే కొర్లగుంటలో నివాసం ఉంటున్న తంగవేలు ఇంట్లో మరోమారు మంగళవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టిటిడి ఉద్యోగి మోహన్‌రెడ్డి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు చేసిన విషయం పాఠకులకు విదితమే. అదే సమయంలో అతనికి సన్నిహితంగా ఉండే తంగవేలు ఇంట్లోకూడా సోదాలు నిర్వహించారు.

08/31/2016 - 06:42

హైదరాబాద్, ఆగస్టు 30: చంద్రబాబునాయుడు కార్యాలయం మీద, అధికారుల మీద, వ్యక్తిగత సిబ్బంది మీద టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన విధానం దుర్మార్గమైనదని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు.

08/31/2016 - 07:56

హైదరాబాద్, ఆగస్టు 30: అగ్రిగోల్డ్‌కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా వారానికి రెండు సార్లు కేసును విచారిస్తామని హైకోర్టు మంగళవారం ప్రకటించింది. దీని వల్ల డిపాజిటర్లకు వెంటనే వారి సొమ్ము చెల్లించేందుకు వీలవుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌బి భట్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

08/31/2016 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌లో కాపు సమాజానికి రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు.

08/31/2016 - 06:32

హైదరాబాద్, ఆగస్టు 30: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసిబి కోర్టు దర్యాప్తుపై నివేదిక కోరడంతో, తెలంగాణ ఏసిబి కేసు విచారణకు కసరత్తు చేపట్టింది. సెప్టెంబర్ 29లోగా విచారణ పూర్తిచేసి సమగ్ర నివేదికను సమర్పించేందుకు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసిబి కోర్టు ఆదేశానుసారం తాజాగా చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

08/31/2016 - 06:29

కర్నూలు, ఆగస్టు 30: రాష్ట్రంలో ఎక్కడ కరవు పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొని పోరాడేందుకు రైతులకు తోడుగా విద్యార్థులను రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదివిన విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతను కరవుపై యుద్ధ సైనికులుగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

08/31/2016 - 06:28

హైదరాబాద్, ఆగస్టు 30: స్విస్‌చాలెంజ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తారని ఏపి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి రమేష్ హైకోర్టుకు తెలిపారు. మంగళవారం హైకోర్టు ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది.

Pages