S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/16/2016 - 18:05

నెల్లూరు: ఇక్కడి బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం వేగంగా దూసుకొచ్చన లారీ ఓ స్కూటీని ఢీకొనడంతో ఎల్‌ఐసి ఏజెంటుగా పనిచేస్తున్న ఓ మహిళ దుర్మరణం పాలైంది. భారీ వాహనాలను నియంత్రించనందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

04/16/2016 - 18:05

విజయనగరం: బొబ్బిలి రాజవంశానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ, ఆయన సోదరుడు బేబీనాయన ఈనెల 20న తెలుగుదేశంలో పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 20న సిఎం చంద్రబాబు జన్మదినం కావడంతో అదే రోజున బొబ్బిలి రాజులు టిడిపిలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

04/16/2016 - 16:43

ఒంగోలు: పంటకాల్వలను ఆక్రమించుకున్నవారు నెలరోజుల్లోగా వైదొలగని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎపి సిఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శనివారం ‘నీరు-చెట్టు’ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి తీరువా వసూళ్లను సాగునీటి సంఘాలకే ఇస్తామని, కాల్వల ఆధునీకరణకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

04/16/2016 - 16:42

ఒంగోలు: పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తాను గతంలోనే చెప్పానని, ఇదే విషయమై తెలంగాణ సిఎం కెసిఆర్ తాజాగా చేసిన సూచనను తాను స్వాగతిస్తున్నానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. సాగునీటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. నీటి పంపకంతో పాటు అనేక విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పొరుగు రాష్ట్రాలు అనుసరించాల్సి ఉందన్నారు.

04/16/2016 - 16:38

రాజమండ్రి: మల్కిపురం మండలం రామరాజులంకలో శనివారం ఉదయం గోదావరి నదిలోకి దూకి గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపం చెందడం వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

04/16/2016 - 14:33

తిరుపతి: తిరుపతి బస్టాండ్ నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉందని ఆర్టీసీ ఎండి సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడి బస్ కాంపెక్సును శనివారం పరిశీలించి, విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖ బస్‌కాంప్లెక్సుల మాదిరి తిరుపతి బస్టాండ్‌ను తీర్చిదిద్దాలన్నారు.

04/16/2016 - 14:33

అనంతపురం: ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన స్వగ్రామైన నీలకంఠాపురంలో శనివారం నాడు 42 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వేడుకలు ముగిశాక ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరవు ప్రాంత ప్రజలను కొంతమేరకు ఆదుకునేందుకు సామూహిక వివాహాలను జరిపించినట్లు ఆయన తెలిపారు.

04/16/2016 - 14:33

అనంతపురం: అనంతపురం జిల్లాకు దక్కాల్సిన హంద్రీనీవా ప్రాజెక్టు జలాలను చిత్తూరు జిల్లా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైకాపా, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, మానవహక్కుల సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ హంద్రీనీవా జలాలపై చిత్తూరు జిల్లాకు ఎలాంటి హక్కూ లేదన్నారు.

04/16/2016 - 14:32

కడప: రైల్వేకోడూరు సమీపంలో శనివారం ఉదయం పోలీసులు దాడులు చేసి సుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15 మంది కూలీలను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ట్రక్కు, నాలుగు బైక్‌లు, నాలుగు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

04/16/2016 - 14:32

విశాఖ: తమపై దేవాదాయశాఖ అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నందుకు నిరసనగా ఈ నెల 27 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తామని అర్చకుల సంఘం నేతలు హెచ్చరించారు. అనేక ఆలయాల్లో అర్చకులకు నిత్యం వేధింపులు, తప్పుడు కేసులు తప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pages