S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/29/2016 - 12:10

విజయవాడ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం పిలిచిన స్విస్‌ఛాలెంజ్ బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 16వరకు పొడిగించింది. సాంకేతిక బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 13వరకు గడువు విధించింది. బిడ్ అర్హత సాధించిన వారి జాబితాను 16న ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

08/29/2016 - 12:08

కర్నూలు: కుంభకర్ణుడిలా పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారి నిద్రలేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. రాజకీయాలు అంటే గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని, అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీజీ హితవు పలికారు. త్వరలో చిరంజీవి రాజ్యసభ పదవికాలం ముగుస్తుందని, రాజీనామాలు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబడ్డారు.

08/29/2016 - 11:29

కర్నూలు: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ

08/29/2016 - 11:23

తిరుమల: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్న కృష్ణమూర్తికి తితిదే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేఈ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

08/29/2016 - 11:13

ఒంగోలు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి లో పెద్దపులి సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పులి కాలిముద్రలు చూసిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పెద్దపులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు.

08/29/2016 - 11:10

కర్నూలు: సోమవారం ఉదయం కర్నూలు వెంకన్న బావి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంబులెన్స్‌ అంబులెన్స్‌ టైరు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు ఉన్న లారీని లారీని ఢీకొంది. అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

08/29/2016 - 05:55

కడప, ఆగస్టు 28 : కర్నూలు-కడప కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ నీటి విడుదలకు సంబంధించి అధికారికంగా ఎటూ తేల్చడం లేదు. కర్నూలు, కడప జిల్లాల వరప్రసాది అయిన కెసి కెనాల్ కింద 2.6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి వుండగా, ప్రస్తుతం 10 నుంచి 15శాతం ఎకరాల్లో కూడా పంటలు సాగు చేయలేదు.

08/29/2016 - 05:51

అనంతపురం కల్చరల్, ఆగస్టు 28 : ఆర్థికంగా వెనకబడిన పేద బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చేయూతనందిస్తుందని కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావు పేర్కొన్నారు. కృష్ణారావు ఆదివారం అనంతపురం నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా నగరంలోని లలిత కళా పరిషత్‌లో నిర్వహించిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడారు.

08/29/2016 - 05:50

విశాఖపట్నం, ఆగస్టు 28: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ఎంపిలు ఘోరంగా విఫలమయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఎంపి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. హోదాపై తాము ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

08/29/2016 - 05:48

హైదరాబాద్, ఆగస్టు 28: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాకు ఉద్యమించి, లక్ష్యాన్ని సాధిస్తానంటే ఎంపీలంతా పవన్ వెంటనే నడుస్తామని అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, తామంతా ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నామన్నారు.

Pages