S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/29/2016 - 05:45

కాకినాడ, ఆగస్టు 28: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సెప్టెంబరు 9న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించే బహిరంగ సభకు కాపుల సభగా ముద్ర పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాకినాడలో తాను నిర్వహించే సభను గిట్టనివారు కాపుల సభగా అభివర్ణించే అవకాశాలుండటంతో ఇటువంటి యత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యనేతలు, అభిమానులకు పవన్ సంకేతాలు పంపినట్టు సమాచారం.

08/29/2016 - 05:44

విజయవాడ, ఆగస్టు 28: అత్యంత నిబద్ధతతో కూడిన మానవీయ సేవలు అందించినందుకుగాను డా.శ్రీధర్ రెడ్డిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యున్నత సేవా పురస్కారం ‘రాష్టప్రతి బంగారు పతకం’ వరించింది.

08/29/2016 - 05:43

విజయవాడ, ఆగస్టు 28: తెలుగుతల్లి ముద్దుబిడ్డ గిడుగు రామమూర్తికి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిడుగు రామమూర్తి జయంతి రోజు ఆగస్టు 29న ఏటా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటూ భాషపై మమకారాన్ని చాటుకుంటున్నామని తెలిపారు. వ్యవహారిక భాషా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ధన్యజీవి గుడుగు రామమూర్తి అని శ్లాఘించారు.

08/29/2016 - 05:43

శ్రీకాళహస్తి, ఆగస్టు 28: తెలుగు భాషను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు పిలుపునిచ్చారు. ధూర్జటి రసజ్ఞ సమాఖ్య అధ్యక్షులు ఎన్ భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రసన్నవరదరాజ కల్యాణ మంటపంలో జాతీయ స్థాయి తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు.

08/29/2016 - 05:42

అచ్చంపేట, ఆగస్టు 28: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయి కృష్ణా రేవులో జాలర్ల వలకు రాకాసిచేప దొరికింది. ఈ చేప శరీరంపై అన్నీ ముళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి రకం చేపలు సాధారణంగా కృష్ణా నదిలో ఉండవని జాలర్లు చెబుతున్నారు. గోదావరి నదీ జలాల్లోనే ఇవి జీవిస్తాయని వివరించారు. పట్టిసీమ నీళ్ల ద్వారా ఈ రకం చేపలు కృష్ణానదిలో ప్రవేశించి ఉండవచ్చని వారు చెబుతున్నారు.

08/29/2016 - 05:42

విశాఖపట్నం, ఆగస్టు 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రెండు రోజులు కావస్తున్నప్పటికీ ఇది బలపడే అవకాశం కనిపించడం లేదు. బలపడేందుకు దోహదపడే రుతుపవన ప్రవాహాలు జపాన్ వైపు తరలిపోతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండేది.

08/29/2016 - 05:26

హైదరాబాద్, ఆగస్టు 28: అమరావతి రాజధానిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పాన్ని నీరుకార్చే ప్రయత్నం చేయవద్దని తెలుగుదేశం అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక వైకాపాకు హితవుచెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు అన్నిరకాలుగా వైకాపా దిగజారిందన్నారు.

08/29/2016 - 05:23

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ సమస్యపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను కాంగ్రెస్, జెడి(యు)లు తప్పుబట్టాయి. 5 శాతం మంది మాత్రమే కాశ్మీర్‌లో హింస ను ప్రేరేపిస్తున్నారని ప్రధాని మోదీ అనుకుంటున్నట్లయితే ఇంకా అక్కడ ఎందుకు కర్ఫ్యూను ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు.

08/29/2016 - 05:22

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్రంలో రైతాంగానికి ఏడు గంటల కంటే ఎక్కువగా అదనంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోనివ్వమని ఆయన చెప్పారు.

08/29/2016 - 05:22

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా కొత్తగా పురావస్తు శాఖను ఏర్పాటు చేయాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగి మూడు సంవత్సరాలు గడచినా, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా పురావస్తు సర్కిల్‌ను ఏర్పాటు చేయలేదన్నారు.

Pages