S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/28/2016 - 05:23

తుళ్లూరు, ఆగస్టు 27: తుళ్లూరు మండలం, నేలపాడు గ్రామానికి చెందిన 54 మంది అసైన్డ్ భూముల రైతులకు ప్లాట్ల కేటాయింపు శనివారం జరిగింది. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయ ఆవరణలో జెసి ముంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డ్రా పద్ధతిన ప్లాట్లను కేటాయించారు. 2వ విడత డ్రాలో భాగంగా 54 మంది రైతులకు నివేశన, వాణిజ్య స్థలాలను కేటాయించగా పలువురు రైతులు సందేహాలను వ్యక్తంచేశారు.

08/28/2016 - 05:21

గుంటూరు, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పేషీల ప్రారంభోత్సవానికి మంత్రులు క్యూకడుతున్నారు. ఇప్పటి వరకు గృహనిర్మాణం, పంచాయతీరాజ్, రవాణా, ఆర్థిక, మున్సిపల్, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, అటవీశాఖల కార్యాలయాల తరలింపు పూర్తయింది.

08/28/2016 - 05:15

తోట్లవల్లూరు, ఆగస్టు 27: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఐలూరు శ్రీరామేశ్వరస్వామి ఆలయంలో రూ.3లక్షల విలువైన 400 సంవత్సరాల నాటి పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం విగ్రహాల చోరీ విషయం వెలుగులోకి రావటంతో ప్రజలు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి దర్యాప్తు చేపట్టారు.

08/28/2016 - 05:15

కాకినాడ, ఆగస్టు 27: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం చెలరేగుతోంది. ముద్రగడ ఆందోళనకు దిగే ప్రతిసారీ అంతుచిక్కని వ్యూహాలను అనుసరిస్తుండటం తెలిసిందే!

08/27/2016 - 17:24

తిరుపతి: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అని, పోరాటంలో తాను గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. తిరుపతిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గోసంరక్షణ చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్త ఒక ఆవును పెంచుకోమనండని పవన్‌ సూచించారు.

08/27/2016 - 17:20

తిరుపతి: ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ రెండున్నరేళ్లయినా అమలు కాలేదని, సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం దేశానికి తెలిసేలా ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేపడతానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధనకు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.

08/27/2016 - 17:18

విజయవాడ: నగరంలోని సిద్ధార్థ కళాశాలలో శనివారం జరిగిన ‘స్వచ్ఛ విజయవాడ’ కార్యక్రమం సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు రహదారిని స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం ఆయన కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పాటుపడాలని ఆయన కోరారు. జిల్లా మంత్రి దేవినేని ఉమ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

08/27/2016 - 16:24

అమలాపురం : అమలాపురంలోని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఇంటి ఎదుట ఓ వ్యక్తి శనివారం కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆక్రమణల తొలగింపులో తన షాపు పోయిందని మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడని సమాచారం.

08/27/2016 - 16:11

గుంటూరు: రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి సబ్ రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శనివారం ఈ ఘటన జరిగింది.

08/27/2016 - 16:10

చిత్తూరు: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రెండేళ్లుగా తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎపి రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళను వేధించినందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని శనివారం ఆదేశించారు.

Pages