S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/26/2016 - 17:55

ఒంగోలు: ఇటీవల పోలీసులు హతమార్చిన గ్యాంగ్‌స్టర్ నరుూం దందాలకు సంబంధించి ఎపిలోని పలు ప్రాంతాల్లో సిట్ (ప్రత్యేక విచారణ బృందం) అధికారులు విచారణ చేస్తున్నారు. నరుూం బావ సలీం గతంలో ఒంగోలులో కొన్నాళ్లు నివసించడంతో సిట్ అధికారులు ఇక్కడికి చేరుకుని పలువురిని ప్రశ్నిస్తున్నారు. సలీంకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గతంలో నరుూం ఎప్పుడైనా ఒంగోలుకు వచ్చాడా? లేదా?

08/26/2016 - 17:27

విశాఖ : ఆనందపురం మండలం వేమగుత్తిపాలెంలో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్‌ సిలెండర్‌ లీకై చెలరేగిన మంటలు బాణాసంచాకు వ్యాపించడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అప్పన్న(45), లక్ష్మి(35) అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె దివ్య(3) అదే సమయంలో దుకాణానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకుంది. లక్ష్మి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి.

08/26/2016 - 17:23

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. మంగళవారం వరకు తమకు సమయం కావాలని ఏపీ సర్కార్‌ కోరింది. చివరిక్షణంలో సమయం అడగడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించిన స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

08/26/2016 - 16:49

ఒంగోలు : అక్షయ గోల్డ్ కేసులో సీఐడీ అధికారులు శుక్రవారం ఒంగోలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 38 మందిని సీఐడీ అధికారులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ సంస్థకు చెందిన 2,500 ఎకరాలతో పాటు రూ. 10 కోట్ల బ్యాంకు డిపాజిట్లను అధికారులు సీజ్‌ చేశారు.

08/26/2016 - 16:47

విజయవాడ: ఓటుకు నోటు కేసు భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి శుక్రవారం అన్నారు. కేంద్రం అనుమతి లేకుండా తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఒప్పందం కుదుర్చుకుంటాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని, విభజన చట్టం ప్రకారం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని రఘువీరా అన్నారు.

08/26/2016 - 16:45

అనంతపురం : రాయదుర్గంలో ఓ చిరుతను అటవీశాఖ అధికారులు అతికష్టం మీద పట్టుకోగలిగారు. కానీ, మరోటి మాత్రం ఇంకా పట్టణంలో సంచరిస్తూనే ఉంది. ఈరోజు పరిమల స్టూడియో సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో సంచరించింది. పులిని చూసిన స్థానికులు హడలిపోయారు. బోనులు, వలలతో అటవీ అధికారులు రాయదుర్గంలో కాపుకాశారు. రాయదుర్గం శివారులో ఉన్న చెట్ల పొదల్లోకి చిరుత వెళ్లిందని భావిస్తున్నారు. నిన్న ఓ చిరుతను అధికారులు పట్టుకోగలిగారు.

08/26/2016 - 16:31

తిరుమల: కృష్ణాష్టమికి మరుసటి రోజున ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా తిరుమలలో ఉట్లోత్సవం కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి మలయప్పస్వామి, మరో బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు తిరువీధుల్లో వూరేగింపుగా హథీరాంజీ మఠం వద్దకు చేరుకున్నారు. ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు సమర్పించి ఉట్లోత్సవం ప్రారంభించారు. ఉట్టిని పగులగొట్టడానికి యువకులు పోటీపడ్డారు.

08/26/2016 - 16:25

రుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం సాయంత్రం తిరుపతిలోనిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి లభించింది. తమ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడంతో పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. రేపు సాయంత్రం 4గంటలకు ఇందిరా మైదానంలో సభ నిర్వహించనున్నారు.పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ తెలిపారు.

08/26/2016 - 12:18

గుంటూరు : తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద శుక్రవారం వేకువజామున లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ఈ ప్రమాద సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వెళ్తున్న పోలీసు వాహనాన్ని మరో జీపు ఢీకొంది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

08/26/2016 - 12:13

విశాఖ : ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం అవకాశం ఉంది.

Pages