S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/26/2016 - 11:17

విజయవాడ: ఈసారి శ్రావణమాసంలో కృష్ణా పుష్కరాలు రావటంతో నాల్గవ శుక్రవారం సామూహిక వ్రతాలను ఇంద్రకీలాద్రిపై దేవస్థానం తరఫున నిర్వహించారు. గతంలో ఉచితంగా నిర్వహించే వ్రతాలకు ఈసారి రూ.1500 టికెట్‌ ధర ఖరారు చేశారు. దీనిపై విమర్శలు రావటంతో తెల్లకార్డుదారులకు ఉచితంగా వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించారు.

08/26/2016 - 04:38

హైదరాబాద్, ఆగస్టు 25: ఆంధ్ర రాష్ట్రంలో జల రవాణాకు మంచి రోజులు వచ్చేశాయి. కాకినాడ-పుదుచ్చేరి మధ్య రూ.3200 కోట్ల విలువైన జలరవాణా మార్గాన్ని నిర్మించడంలో భాగంగా తొలి దశలో 68 కి.మీ పొడవున కాల్వను తవ్వేందుకు రూ. 69.76 కోట్లతో టెండర్ ప్రక్రియను వచ్చే వారం ఖరారు చేయనున్నారు.

08/26/2016 - 04:37

కాకినాడ, ఆగస్టు 25: మాజీ సైనికోద్యోగులకు ‘వన్ ర్యాంక్ -వన్ పింఛన్’ విధానం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. విశాఖ నేవల్ బేస్ సమీపంలోని ఐఎన్‌ఎస్ సముద్ర ఆడిటోరియంలో జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సైనికుల నుండి వినతిపత్రాలు స్వీకరిస్తారు. భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుమారు 16 లక్షల మంది మాజీ సైనికులున్నారు.

08/26/2016 - 04:36

హైదరాబాద్, ఆగస్టు 25: వినుకొండలో శ్రీ వివేకానంద విద్యాసంస్థలు పేరుతో నిర్వహిస్తున్న దాదాపు పాతిక విద్యాసంస్థల లోగుట్టుపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఎన్‌సిఇఆర్‌టిని హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.

08/26/2016 - 04:36

గుంటూరు, ఆగస్టు 25: భారతదేశ గ్రామీణ జీవన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే అత్యద్భుతమైనవని, అయితే నేడు విదేశీ ప్రభావానికి లోనై భారతీయ జీవన మూలాలకు దూరమవుతోందని భారత పరిక్రమ పాదయాత్ర చేస్తున్న ధార్మిక ప్రచార జాతీయ ప్రతినిధి పూజ్య సీతారాంజీ ఆవేదన వ్యక్తంచేశారు.

08/26/2016 - 04:34

హైదరాబాద్, ఆగస్టు 25: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలను ముక్తసరిగా ఐదు రోజులు జరిపించి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

08/25/2016 - 18:08

హైదరాబాద్‌ : అమరావతిలో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ పెట్టనున్నట్లు కోచ్ పుల్లెల గోపీచంద్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని ఆణిముత్యాలను తయారు చేస్తానని అన్నారు. రజత పతకం విజేత పీవీ సింధు మాట్లాడుతూ, టోక్యో ఒలింపిక్స్‌కు చాలా సమయం ఉందని, ప్రస్తుతం సూపర్‌ సిరీస్‌తో పాటు ఇతర టోర్నీలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

08/25/2016 - 18:05

ఒంగోలు: ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై ఆ యువతి దాడి చేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో యువకుడు నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్కాపురంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

08/25/2016 - 17:35

తిరుపతి : తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు లేవని టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించిన వినోద్ రాయల్ కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు. హీరోలు ఎప్పుడూ గొడవ పడరు గానీ, అభిమానులు మాత్రం గొడవ పడతారని చెప్పారు. వినోద్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

08/25/2016 - 16:42

విజయవాడ: ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎపిలో వాల్‌పోస్టర్లను నిషేధించనున్నట్లు సిఎం చంద్రబాబు గురువారం మీడియాకు తెలిపారు. గోడలపై పోస్టర్లు అంటించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలు, విద్యార్థులతో కలిసి పోస్టర్ల నిషేధానికి కృషి చేసేలా ఆదేశాలు జారీచేస్తామన్నారు. పట్టణాల్లో పోస్టర్ల కోసం విడిగా స్థలాలను కేటాయిస్తామన్నారు.

Pages