S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2016 - 15:52

విశాఖ : విశాఖ నగరంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఈనెల 30లోగా అనుమతి తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ గురువారం తెలిపారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

08/25/2016 - 15:49

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పేర్కొన్నారు. దుర్గా ఘాట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి డ్రోన్ల ద్వారా పోలవరం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని, ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1700 కోట్లు ఇవ్వాలన్నారు.

08/25/2016 - 15:21

అనంతపురం : రాయదుర్గం లక్ష్మీబజార్‌లో మీ-సేవా కేంద్రం వద్ద చెట్లలో రెండు చిరుతలు ఉండటాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు చిరుతలను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

08/25/2016 - 15:18

శ్రీకాకుళం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి తనను వేరు చేయడానికే కొన్ని పత్రికల యాజమాన్యాలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆరోపించారు. అవాస్తవ కథనాలతో వైఎస్‌ఆర్‌సీపీని బలహీన పర్చాలనుకుంటున్నారని ధర్మాన మండిపడ్డారు.

08/25/2016 - 14:02

విశాఖ: ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు, ఈనెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. శక్రవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల విస్తారంగా, శనివారం కోస్తా, తెలంగాణ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గురువారం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.

08/25/2016 - 13:33

తిరుపతి: మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని, అభిమానం ఉండాలే కానీ చంపుకునేంత స్థాయికి వెళ్లడం మంచిది కాదని హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హితవు అన్నారు. అభిమాని వినోద్ కుటుంబాన్ని గురువారం పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. హీరోల మధ్య పోటీ తత్వమే ఉంటుంది తప్ప ఇలాంటి గొడవకు దారితీయడం బాధాకరమన్నారు.

08/25/2016 - 11:29

అనంతపురం : పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టులో గురువారం ఉదయం ఏసీబీ తనిఖీలు చేపట్టి, అక్రమంగా వసూలు చేసిన రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకుంది. ఎంవీఐ గాయత్రీ, హోంగార్డు శివకుమార్, చెక్‌పోస్ట్‌ ఇన్‌చార్జ్‌ మల్లికార్జున్‌పై చర్యలకు ఏసీబీ సిఫారసు చేసింది.

08/25/2016 - 11:27

ఏలూరు: ఏలూరులో గురువారం ఉదయం అటవీశాఖ అధికారులు నకిలీ ఎర్రచందనం తరలిస్తున్న 3 వాహనాలను సీజ్‌ చేసి, నలుగురిని అరెస్ట్‌ చేశారు.

08/25/2016 - 11:25

విశాఖ: పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

08/25/2016 - 11:23

తిరుపతి: ఫ్యాన్స్ వార్‌లో మృతి చెందిన వినోద్ కుటుంబాన్ని జనసేత అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ గురువారం ఉదయం పరామర్శించారు. వినోద్ ఇంటికి వచ్చిన పవన్ అతడి తల్లిని ఓదార్చారు. ఇద్దరు హీరోల గురించి జరిగిన ఘర్షణలో మూడు రోజుల క్రితం కత్తిపోటుకు గురైన వినోద్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Pages