S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/24/2016 - 08:32

విజయవాడ, ఆగస్టు 23: కృష్ణా పుష్కరాలను అద్భుత రీతిలో నిర్వహించి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక దుర్గా ఘాట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళవారం ప్రజా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

08/24/2016 - 08:31

విశాఖపట్నం, ఆగస్టు 23: రాష్ట్ర విభజన తర్వాత ఎపి టెలికాం సర్కిల్ విభజన ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. అక్టోబర్ నుంచి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పని చేయనుంది. ఈ విషయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ విశాఖ జిల్లా సీనియర్ జనరల్ మేనేజర్ నళినీ వర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు.

08/24/2016 - 08:30

నరసరావుపేట, ఆగస్టు 23: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని టౌన్ హాలులో కాకినాడ జెఎన్‌టియుకు అనుబంధంగా నరసరావుపేటలో ఏర్పాటుచేసిన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎస్‌జి మురళీకృష్ణ సభకు అధ్యక్షత వహించారు.

08/24/2016 - 08:30

శ్రీకాకుళం, ఆగస్టు 23: దేశంలో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం సంభవించినా శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు హాని జరుగుతునే ఉంది. గడచిన గోదావరి పుష్కరాలు తొలిరోజున అనేక మంది జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు దుర్మరణం పాలవ్వగా మరికొంతమంది క్షతగాత్రులుగా మిగిలిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాపుష్కరాలు కూడా శ్రీకాకుళం జిల్లాను శోకసంద్రంలో ముంచాయి.

08/24/2016 - 08:19

హైదరాబాద్, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలంలో కనీసం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా బృహత్ ప్రణాళికను రూపొందించింది. ప్రతి ఇంటి నుండి కనీసం ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేయాలని, ఇందుకోసం రానున్న రోజుల్లో 41 విదేశీ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించింది.

08/24/2016 - 08:18

హైదరాబాద్, ఆగస్టు 23: ఏపి శాసనసభ కార్యదర్శి విద్యార్హతపై జరుగుతున్న వివాదం స్పీకర్ కోర్టుకు చేరింది. ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తోన్న సత్యనారాయణకు తగిన విద్యార్హత లేనందున, ఆయన ఆ పదవికి అనర్హుడని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాచార హక్కు కమిషనర్‌ను ఆశ్రయించినా ఫలితం కనిపించకపోవడంతో, ఆయన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు.

08/24/2016 - 07:55

హైదరాబాద్, ఆగస్టు 23: శాసనసభ సమావేశాల తర్వాత ఏపి మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా పనితీరు ప్రదర్శించడంలో విఫలమైన కొందరు మంత్రులపై వేటు తప్పదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

08/24/2016 - 07:54

అమరావతి, ఆగస్టు 23: గత 12 రోజులుగా పుణ్యక్షేత్రమైన అమరావతిలో సాగుతున్న కృష్ణా పుష్కరాలు మంగళవారం రాత్రితో వైభవంగా ముగిసాయి.

08/24/2016 - 07:53

విశాఖపట్నం, ఆగస్టు 23: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు సంస్కృతి గురించి తెలుసు కోవాలంటే భవిష్యత్‌లో మనం విదేశాలను ఆశ్రయించే పరిస్థితులు ఎదురయ్యే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

08/24/2016 - 07:52

హైదరాబాద్, ఆగస్టు 23: ఏపిలో ప్రజల నిత్య సవాళ్లకు ఐటి పరిష్కారాలను చూపించడంలో యువత తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశంపై వర్కుషాప్ నిర్వహించినపుడు అనేక మంది యువకులు నిత్యసమస్యలపై ఐటి ద్వారా తమ పరిష్కారాలను సూచించారు.

Pages