S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/17/2016 - 04:48

విశాఖపట్నం, ఆగస్టు 16: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మంగళవారం నాటికి వాయుగుండంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్‌కు సమీపంలోని డిగాకు ఆగ్నేయంగా 160 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది తూర్పు ఆగ్నేయ దిశగా పయనిస్తూ బాలాసోర్ ప్రాంతానికి చేరుతుందన్నారు.

08/17/2016 - 04:47

విజయవాడ, ఆగస్టు 16: కృష్ణా పుష్కరాలు సందర్భంగా మిగిలిన మరో వారం రోజుల పాటు పుష్కర స్నానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిచింతల నుంచి 12వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజి వద్ద క్రమేణా నీటిమట్టం పెరుగుతున్నది.

08/17/2016 - 04:46

తిరుమల, ఆగస్టు 16: శ్రీవారిని దర్శించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మొదటి ఘాట్‌రోడ్డులోని 43 వ మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన భర్తను రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (48), లక్ష్మి (41) దంపతులు శ్రీవారిని దర్శించుకోవడానికి ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు.

08/17/2016 - 04:45

కాకినాడ, ఆగస్టు 16: పాఠశాలల్లోని తోటల్లో రసాయన రహిత పోషక విలువలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పెంచడానికి తూర్పు గోదావరి జిల్లాలో ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో ఒక పథకాన్ని అమలుచేయనున్నారు. తొలివిడతగా జిల్లాలోని 514 పాఠశాలల్లో ‘న్యూట్రీ గార్డెన్స్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

08/17/2016 - 04:41

విజయవాడ/ కర్నూలు/ గుంటూరు, ఆగస్టు 16:కృష్ణా పుష్కరాల్లో భక్త జన సందోహం కొనసాగుతోంది. ఐదవ రోజైన మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మంగళవారం కావడంతో పిండ ప్రదానాలు చేసిన వారి సంఖ్య బాగా తగ్గింది.

08/17/2016 - 04:40

హైదరాబాద్, ఆగస్టు 16: కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ స్కీం వల్ల రాష్ట్రంలోని డిస్కంలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతాయని, సాలీనా డిస్కంలపై రూ. 330 కోట్ల మేరకు వడ్డీ భారం తగ్గుతుందని ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు కేంద్రం రూ.11000 కోట్లతో ఉదయ్ స్కీంను అమలు చేస్తోందన్నారు.

08/17/2016 - 04:36

హైదరాబాద్, ఆగస్టు 16: ‘వెనుకబడిన జిల్లాలకు మీరు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయండి’
‘మేం ఇంతకుముందు ఇచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలు పంపించండి’
‘ఆ ఖర్చుల వివరాలు మీకు ఇచ్చేశాం. కొత్త నిధులు విడుదల చేయండి’
‘అబ్బే.. మీరిచ్చిన వివరాలు సరిపోవు. లెక్కలు తేడాలొస్తున్నాయి. పూర్తి వివరాలిస్తే మళ్లీ నిధులిస్తాం’

08/17/2016 - 04:35

తాళ్లపూడి/పెరవలి, ఆగస్టు 16: పశ్చిమ గోదావరి జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతిచెందారు. దీనితో ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అయితే ఇవి డెంగ్యూ మరణాలు కావని వైద్యాధికార్లు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో శ్రీకాంత్ (18) అనే యువకుడు గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ సోమవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు.

08/17/2016 - 04:35

విజయవాడ, ఆగస్టు 16: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీ నుండి ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు.

08/17/2016 - 04:34

హైదరాబాద్, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరం నుండి ఆరో తరగతి మొదలు ఇంటర్మీడియట్ వరకూ అన్ని క్లాసుల్లో యోగాను తప్పని సరి చేసింది. ఈ మేరకు జూన్ ఆరో తేదీనే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే తాజాగా ఇచ్చిన సవరణ ఉత్తర్వుల్లో పతంజలి, ఇషా ఫౌండేషన్, ఆర్టు ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీ సంస్థల ప్రతినిధులు పాఠశాలల్లో యోగ శిక్షణ ఇచ్చేందుకు అనుమతించింది.

Pages