S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/16/2016 - 12:02

విజయవాడ: రాష్ట్ర విభజన ఫలితంగా ఎపికి అన్యాయం జరిగిందని కేంద్రం ఎపుడో గ్రహించిందని, ప్రత్యేక సాయం విషయమై త్వరలోనే మంచి వార్త వింటారని కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ అన్నారు. ఎపికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కేంద్రం ఇప్పటికే చర్చలు జరుపుతోందన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు ఎపి ప్రభుత్వం చేసిన ఏర్పాటు బాగున్నాయన్నారు.

08/16/2016 - 12:01

విజయవాడ: పగటి ఉష్ణోగ్రతలు పెరిగినందున ఉపవాసాలతో పుష్కర స్నానాలకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఘాట్‌ల వద్ద కొందరు స్పృహతప్పి పడిపోయినందున వైద్యులు ఈ సూచనలు చేస్తున్నారు. ఎండవేళ దాహం అధికంగా ఉంటే మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు తాగాలని, ఉపవాసాలతో వస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవంటున్నారు. విజయవాడలో ఘాట్‌ల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వైద్య శిబిరాల సంఖ్యను పెంచింది.

08/16/2016 - 12:00

విజయవాడ: ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించి వారి మన్ననలు పొందాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అధికారులనుద్దేశించి అన్నారు. కృష్ణా పుష్కరాలు అయిదోరోజు ఏర్పాట్లపై ఆయన మంగళవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసంతృప్తి, ఇబ్బంది కలగకుండా సేవలందించాలన్నారు. విద్యార్థులు, ఇతర వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.

08/16/2016 - 11:26

విశాఖ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ గత రెండు, మూడు నెలల్లో పలుమార్లు విశాఖకు వచ్చి వెళ్లాడని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. నయీమ్ విశాఖ ఎందుకొచ్చినట్టు? ఏమైనా సెటిల్‌మెంట్లు, దందాలు చేశాడా? అన్న అంశాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. సిట్ అధికారులు ఆదివారం విశాఖలో ప్రధానంగా రైల్వేస్టేషన్‌పై దృష్టి సారించి.. ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.

08/16/2016 - 05:58

కర్నూలు, ఆగస్టు 15: కర్నూలు జిల్లాలో కృష్ణా పుష్కరాల నాల్గవ రోజున కృష్ణానదీ తీరంలో భక్తులు పోటెత్తారు. ప్రధాన ఘాట్లు శ్రీశైలం, సంగమేశ్వరంలో 1.50 లక్షల మంది భక్తులు సోమవారం పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీశైలం, సంగమేశ్వరంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

08/16/2016 - 05:56

అనంతపురం కల్చరల్, ఆగస్టు 15: అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి(పిటిసి) మైదానంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్టస్థ్రాయి వేడుకలు మొట్టమొదటిసారి నగరంలో నిర్వహించడంతో తిలకించేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. తొలుత జాతీయ పతాకావిష్కరణ గావించిన ముఖ్యమంత్రి అనంతరం ఓపెన్‌టాప్ జీపులో స్టేడియం చుట్టూ తిరిగి ప్రజలకు అభివాదం చేశారు.

08/16/2016 - 05:54

విజయవాడ, ఆగస్టు 15: కృష్ణా పుష్కరాలు సందర్భంగా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పిస్తున్న వసతులు తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుండి 90 శాతానికి పైగా సానుకూల స్పందన వచ్చే విధంగా అధికార యంత్రాంగమంతా సక్రమంగా పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని మెరుగైన సేవలందించేందుకు అన్ని విధాలా కృషిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

08/16/2016 - 05:52

జి.మాడుగల, ఆగస్టు 15: విశాఖ జిల్లా జి.మాడుగల మండలంలోని పలు ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవంరోజు ఎగరాల్సిన జాతీయ జెండాలకు బదులు నల్ల జెండాలు రెపరెపలాడాయి. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో మండలంలో ఎక్కడా త్రివర్ణ పతాకం రెపరెపలాడ లేదు. బొయితిలి ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఆదివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు నల్ల జెండాను ఎగరవేసారు.

08/16/2016 - 05:50

విజయవాడ, ఆగస్టు 15: విజయవాడ కృష్ణవేణి ఘాట్ వద్ద ఆదివారం ఓ పాత నేరస్థుడు దొరికిపోయాడు. పి శ్రీనివాస్ అనే ఈ పాత కేడీని సిసి కెమేరా, డ్రోన్ కెమేరా ద్వారా గుర్తించి పట్టుకున్న విజయవాడ సిసిఎస్ ఎస్‌ఐ బాలశౌరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10వేల రూపాయల రివార్డు అందచేశారు. సోమవారం ఉదయం స్థానిక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన కార్యక్రమంలో ఈ రివార్డు అందచేశారు.

08/16/2016 - 05:49

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 15: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను గడచిన మూడు రోజుల్లో దాదాపు 5 లక్షల మంది యాత్రికులు దర్శించుకొని తరించారు. కేవలం ఆది, సోమవారాల్లో 3 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు.

Pages