S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/09/2016 - 00:40

హైదరాబాద్ : బుధవారం ఏర్పడుతున్న సూర్యగ్రహణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్‌లో ఈ గ్రహణం పాక్షికంగానే కనిపిస్తున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం సంపూర్ణసూర్యగ్రహణం స్థాయిలోనే ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో గ్రహణం విడుస్తుంది.

03/09/2016 - 00:27

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలో మంగళవారం సాయంత్రం జరిగిన బాలచాముండికా అమరేశ్వరస్వామివార్ల దివ్య రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం ప్రారంభమైన 20 నిముషాల్లోపే తోపులాట జరగడంతో కొంతమంది రథ చక్రాల కిందపడ్డారు. గాయ పడ్డవారిలో కోట మురళి మృతి చెందాడు.

03/08/2016 - 18:38

హైదరాబాద్: తెలుగుదేశం పాలనలో మహిళలకు భద్రత కరవైందని, ఇందుకు ఎన్నో సంఘటనలు రుజువులుగా ఉన్నాయని విపక్షనేత వైఎస్ జగన్ మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కృష్ణాజిల్లాలో ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చినా నిందితులైన ఎమ్మెల్యేపైన, ఆయన అనుచరులపైన ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు.

03/08/2016 - 18:37

హైదరాబాద్: మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇటీవల ఓ సినిమా ఆడియో ఆవిష్కరణ సభలో మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివదాం సృష్టించిన సంగతి తెలిసిందే.

03/08/2016 - 18:37

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న ఇంటర్ విద్యార్థిని వౌనిక తీవ్రగాయాలకు లోనే మరణించింది.

03/08/2016 - 16:14

అనంతపురం: పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతూ కిందకు జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మరణించాడు. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తాడిపత్రిలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తుండగా వరప్రసాద్ చేతి నుంచి స్కేల్ జారి రోడ్డుపై పడింది.

03/08/2016 - 16:13

హైదరాబాద్ : ఓ వివాహిత మహిళను వేధించనట్లు తన కుమారుడిపై అభియోగాలు రుజువైతే అతను చట్టప్రకారం శిక్షకు అర్హుడేనని మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, పోలీసులు కేసు నమోదు చేశాక తానే స్వయంగా సుశీల్‌ను తీసుకువెళ్లి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించానన్నారు. ఈ కేసును విపక్షనేత జగన్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని మంత్రి చెప్పారు.

03/08/2016 - 12:18

హైదరాబాద్: అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగితేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తిహక్కు కల్పించినట్లు గుర్తు చేశారు. స్ర్తి,పురుషుల సమానత్వం దిశగా ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

03/08/2016 - 12:17

విశాఖ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మహిళా నేత పీలా వెంకటలక్ష్మి మంగళవారం ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. నర్సీపట్నంలోని తన ఇంట్లో ఆమె అపస్మారకంగా పడి ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మహత్యకు యత్నించారన్న విషయమై సమాచారం అందాల్సి ఉంది.

03/08/2016 - 12:14

విజయవాడ: పోరంకి గ్రామానికి చెందిన సురేఖ అనే వివాహిత మంగళవారం ఉధయం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలింకా తెలియరాలేదు.

Pages