S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/15/2016 - 14:55

అనంతపురం: ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రులంతా ప్రత్యేక హోదా కావాలంటున్నారని, అయితే హోదా ఇచ్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరన్నారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.

08/15/2016 - 14:49

హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నానని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏపీలో నిర్వహించాలని గతంలో భావించినా, అది సాధ్యపడలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని చెప్పారు.

08/15/2016 - 12:31

చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని చల్లపాలెం వద్ద సోమవారం తెల్లవారు జామున విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

08/15/2016 - 12:29

విజయవాడ: దుర్గా ఘాట్‌లో పుష్కరస్నానం చేస్తున్న విజయవాడ కొత్తపేటకు చెందిన విద్యార్థి సుమంత్‌కి పాము కాటువేసింది. వెంటనే విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

08/15/2016 - 12:24

విజయవాడ: ఒక్కసారిగా లిఫ్ట్ కిందకు జారి పడటంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. విజయవాడ భవానీపురంలోని భవానీ టవర్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

08/15/2016 - 12:20

విజయవాడ: విజయవాడలో కృష్ణా పుష్కరాల నాలుగవ రోజున ఫెర్రిఘాట్‌లో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు యశ్వంత్ అనే బీటెక్ విద్యార్థి ( ఖమ్మం జిల్లా వాసి) మృతి చెందాడు.

08/15/2016 - 12:17

విజయవాడ: వరుస సెలవుల నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికారులు విడతలు విడతలుగా భక్తులను ఘాట్ల వద్దకు పంపుతున్నారు.

08/15/2016 - 12:02

అనంతపురం: విభజన చట్టంలో ఎన్నో వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. అనంతపురంలోని నీలం సంజీవయ్య మైదానంలో నిర్వహించిన జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

08/15/2016 - 07:24

హైదరాబాద్, ఆగస్టు 14: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఆదా చేసేందుకు వివిధ పథకాల కోసం రాష్ట్రప్రభుత్వం సాలీనా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఇంధన పొదుపుపై విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

08/15/2016 - 07:23

రాజమహేంద్రవరం, ఆగస్టు 14: కేంద్ర అంతర్గత జల రవాణా సాధికార సంస్థ (ఎఐడబ్ల్యుఎఐ) నాల్గవ అంతర్గత జల రవాణా ప్రాజెక్టు రాష్ట్రంలో కార్యరూపంలోకి వచ్చింది. ఇప్పటికే సర్వే పూర్తయిన ఈ పథకంలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలు, నదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు.

Pages