S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/12/2016 - 04:17

విజయవాడ, ఆగస్టు 11:రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం వృధాగా మారుతోంది. నెలల తరబడి నిర్వహించిన సమీక్షలు చివరకు పుష్కరాలకు పనికిరాకుండా పోయాయి. అధికారుల అలసత్వం, సమన్వయ లోపంతో పుష్కర పనులు గురువారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయంటే వారి పనితీరు ఏ స్ధాయిలో ఉందో ఊహించవచ్చు.

08/12/2016 - 04:17

గుంటూరు, ఆగస్టు 11: సీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో గల త్రిదండి శ్రీ రామానుజ చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. పవిత్ర కృష్ణా పుష్కరాల ప్రారంభం సందర్భంగా చినజీయర్ సిఎంకు ఆశీర్వచనాలు పలికారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా ఉన్నాయని జీయర్ స్వామి సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర ప్రాశస్త్యాన్ని ఆయన సిఎంకు విశదీకరించారు.

08/12/2016 - 04:14

అనంతపురం, ఆగ స్టు 11 : పంద్రాగస్టు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్న నేపథ్యం లో గురువారం అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ఉత్సవాలకు సంకేతంగా కలెక్టర్ కోన శశిధర్ హీలియం బెలూన్‌ను ఎగురవేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే స్టేడి యం చుట్టూ 10 రంగు రంగుల బెల్లూన్లను ఎగురవేయాలని నిర్ణయించిన విషయం విదితమే.

08/12/2016 - 04:12

కావలి రూరల్, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని పెద్ద పట్టపుపాలెం పంచాయతీ నంద్యమ్మపురం గ్రామానికి చెందిన వౌనిక అనే రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావి కోసం తవ్విన గుంతలో పడింది. గ్రామానికి చెందిన జ్యోతి,తిమ్మయ్యల కుమార్తె వౌనిక ఆడుకుంటూ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరుబావిలో పడింది. బోరు సుమారు 30 నుంచి 40 అడుగుల లోతు ఉంటుంది.

08/12/2016 - 04:11

విజయవాడ, ఆగస్టు 11: అవును.. నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కోటీశ్వరుడు. ఈ విషయంలో ఆయనకు అరుణాచల్‌ప్రదేశ్ సిఎం ఒక్కరే కొంచెం పోటీ ఇస్తున్నారు. మిగిలిన వారంతా చాలా దూరంలో ఉన్నారట. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్ల్యు) రూపొందించిన నివేదిక ఈ విషయం వెల్లడిస్తోంది.

08/12/2016 - 04:09

వీరవాసరం, ఆగస్టు 11: ఏడాది వ్యవధిలో రెండు పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను ప్రారంభించిన రెండో ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. 1967, 68 సంవత్సరాల్లో ఈ అవకాశం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కగా, మళ్లీ మూడు పుష్కరాల అనంతరం ఈ అవకాశం చంద్రబాబుకు దక్కింది.

08/12/2016 - 04:08

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న సభా వేదికపై ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు తెలుగుదేశం పార్టీలో చేరడానికి స్థానికంగా ఉన్న ఒక కళ్యాణమండపంలో సభ నిర్వహించారు.

08/12/2016 - 04:07

తిరుమల, ఆగస్టు 11: ప్రతి హైందవ భక్తుడు తమ స్వగ్రామాల్లో భక్తి ప్రచారానికి సారథులు కావాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. గురువారం విరామ సమయంలో ఆయన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాల రావులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఇ ఓ డాక్టర్ డి సాంబశివరావు సాదరంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు.

08/12/2016 - 04:06

ఇంద్రకీలాద్రి, ఆగస్టు 11: పున్నమి, దుర్గా, భవానీపురం, తదితర ఘాట్‌ల్లో ఇప్పటి వరకు దుర్గగుడి అధికారులు కేశఖండనశాలను ఏర్పాటు చేసేదిశగా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. దుర్గమ్మకు మొక్కుబడుల నిమిత్తం తలనీలాలు సమర్పించుకోనే భక్తులు ఈపుష్కరాల సమయంలో అధిక సంఖ్యలో తరలి వస్తారు. పుష్కరాలు శుక్రవారంతోనే ప్రారంభం కానున్నాయి.

08/12/2016 - 04:40

గుంటూరు, ఆగస్టు 11: కృష్ణా పుష్కరాలను స్వాగతిస్తూ గుంటూరులో గురువారం సాయంత్రం వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతీలాల్ దండే, అదనపు జెసి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి యాత్రను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నగర వీధుల్లో విచిత్ర వేషధారణలతో ఎన్టీఆర్ స్టేడియం వరకు యాత్ర నిర్వహించారు.

Pages