S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/10/2016 - 05:04

విజయవాడ, ఆగస్టు 9: కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానాలు, ఇతర పూజాదికాలు నిర్వర్తించే పురోహితులపై ఆంక్షలు విధించరాదంటూ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి సునీల్‌చౌదరి తీర్పు ఇచ్చారు.

08/10/2016 - 04:34

అనంతపురం, ఆగస్టు 9: 70వ స్వాతంత్య్ర దినోత్సవ రాష్టస్థ్రాయి వేడుకలకు అనంతపురం వేదిక కాబోతోంది. ఇందుకు నగరంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీ (పిటిసి) స్టేడియం వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రూ.3 కోట్లు విడుదల చేసింది. దీంతో గత పది రోజులుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

08/10/2016 - 04:13

విజయవాడ, ఆగస్టు 9:పుష్కర పనులు చురుగ్గా సాగడం లేదా? ఇంకా 48 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయా? అధికార గణాంకాలు సైతం అది నిజమేనంటున్నాయి. మరో రెండు రోజుల్లో పుష్కరాలు మొదలు కాబోతుండగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన పనుల్లో 48 శాతం పూర్తి కాలేదని సాక్షాత్తూ సిఎం డ్యాష్ బోర్డు చెబుతోంది.

08/10/2016 - 04:12

విశాఖపట్నం, ఆగస్టు 9: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను అరకు ఏజెన్సీలో గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, తన ప్రయత్నం మంచి ఫలితానే్న ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాను దత్తత తీసుకున్న అరకు మండలం పెదలబుడు గ్రామంలో సిఎం మంగళవారం పర్యటించి, గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు.

08/09/2016 - 17:46

విశాఖ : అరకును దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సం సందర్భంగా మంగళవారం అరుకులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో రూ. 68 కోట్లతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తాని అన్నారు. ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు.

08/09/2016 - 17:39

విజయవాడ: మరికొద్ది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరం కొత్త అందాలు సంతరించుకుంది. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు విద్యుద్దీపాలతో కాంతులీనుతోంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, స్వరాజ్య మైదానంలో వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయాలను విద్యుద్దీప తోరణాలతో నయనానందకరంగా అలంకరించారు. ఆ కాంతులు కృష్ణానదిలో ప్రతిబింబిస్తున్నాయి.

08/09/2016 - 17:38

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పరిపాలనాదక్షుడిగా చెప్పుకుంటున్న సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. హోదా సాధించేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు.

08/09/2016 - 17:36

చెన్నై: అనారోగ్యంతో కన్నుమూసిన సినీనటి జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని కన్మమ్మాపేట స్మశానవాటికలో మంగళవారం ముగిశాయి. జ్యోతిలక్ష్మిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తరలివచ్చారు. జ్యోతిలక్ష్మి అల్లుడు బాలాజీ ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

08/09/2016 - 11:46

విజయవాడ: భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని క్విట్ ఇండియా ఉద్యమం కీలక మలుపుతిప్పిందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా ఆయన సమరయోధులకు మంగళవారం నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

08/09/2016 - 04:49

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: గోదావరి తీరంలో అంత్య పుష్కర స్నానాలకు భక్త జనం వరదలా పొంగింది. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని వివిధ స్నాన ఘట్టాల్లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. సుమారు 1.32 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక వైపు గోదావరి నదికి వరద పోటెత్తగా, మరో వైపు పుణ్య స్నానాలకు భక్త జనం జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు.

Pages