S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/06/2016 - 14:55

గుంటూరు : ఫిరంగిపురం దగ్గర శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, కారులో ఉన్న పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

08/06/2016 - 14:52

అనంతపురం: రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసిన ఘనత తమదే అని , చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ధర్మవరంలో శనివారం చేనేత రుణవిముక్తి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే చేనేత కార్మికులకు రూ.36కోట్ల రుణవిముక్తి చేశామని సీఎం తెలిపారు. వ్యవసాయం తర్వాత చేనేత పైనే ఎక్కువ ఆధారపడుతున్నారన్నారు.

08/06/2016 - 14:00

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయమై ఇప్పటికే ఆర్థికమంత్రి జైట్లీ, నీతిఆయోగ్ దృష్టిసారించినట్టు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఇక్కడ మీడియాకు తెలిపారు. హోదా విషయమై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందన్నారు.

08/06/2016 - 14:00

అనంతపురం: ఎపి సిఎం చంద్రబాబు శనివారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ధర్మవరంలో రైల్వేవంతనెను కూడా ఆయన ప్రారంభించారు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

08/06/2016 - 12:36

శ్రీశైలం: ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గురిష్ఠస్థాయికి చేరుతుండటంతో నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో జలాశయంలో నీటిమట్టం 13అడుగుల మేర పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,54,629 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరిచుకుంది.

08/06/2016 - 11:47

శ్రీకాకుళం : 40 మంది ప్రయాణికులతో నాగావళి నదిలో వెళ్తున్న నాటు పడవకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జిల్లాలోని సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద చోటు చేసుకుంది. నాటు పడవ నదిలోని గుర్రపు డొక్కకు చిక్కుకుంది. పడవ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

08/06/2016 - 11:40

రాజమండ్రి: గోదావరి నీటిమట్టం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం నిలకడగా ఉంది. పుష్కరఘాట్ల వద్ద గోదావరి అంత్య పుష్కరాలు ఏడో రోజుకు చేరాయి. దీంతో గోదావరి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అంత్యపుష్కరాలతోపాటు శ్రావణమాసం కావడంతో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

08/06/2016 - 07:44

విజయవాడ, ఆగస్టు 5: మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలు చరిత్రలో మిగిలిపోయేలా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని ఎ ప్లస్ కనె్వన్షన్ సెంటర్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల అధికారులతో కృష్ణాపుష్కరాలపై శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/06/2016 - 07:43

హైదరాబాద్, ఆగస్టు 5: ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమల కళ వచ్చేసింది. కృష్ణా జిల్లాలో బంగారం శుద్ధి కర్మాగారం, అనంతపురం జిల్లాలో ఏరోస్పేస్ క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ రెండు యూనిట్ల వల్ల రాష్ట్రంలో కొత్తగా 10045 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల ఏర్పాటుకు బోర్డు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రూ.

08/06/2016 - 07:42

హైదరాబాద్, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న 18 జాతీయ విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోద ముద్ర వేయడంతో పాటు నిధులను సైతం విడుదల చేసింది. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్, ఐఐటిలకు నిధులు సమకూరి, ఆ సంస్థల ఏర్పాటు వేగవంతం అవుతుందని చెబుతున్నారు.

Pages