S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/26/2016 - 02:30

విజయనగరం(టౌన్), జూలై 25: జిల్లాలోని డెంకాడ మండలం మోదవలసలోని బైబిల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎల్.ప్రసన్నబాబు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసారు. ఫిర్యాదును పరిశీలించిన ఎఎస్పీ ఎవి రమణ పరిశీలించారు.

07/26/2016 - 02:29

రాజమహేంద్రవరం, జూలై 25: గోదావరి నది అంత్య పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించి పుష్కరుడుని ఘనంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేపట్టారు. దేశంలో ఏ నదికీ లేని విధంగా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక్క గోదావరి నదికి మాత్రమే సొంతం. అతి ప్రాచీన నది గోదావరికి సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఘనంగా పుష్కరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి.

07/26/2016 - 02:29

తిరుమల, జూలై 25: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలో టిటిడి ఏర్పాటుచేస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నాలుగంచెల విధానంతో దర్శనం కల్పించనున్నట్లు తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. కృష్ణాపుష్కరాల్లో టిటిడి చేపడుతున్న ఏర్పాట్లకు సంబంధించి ఆయన తిరుమలలో అన్నదానం, ఆరోగ్యవిభాగం, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

07/25/2016 - 18:31

విజయనగరం: తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఓ యువకుడు యువతిపై బ్లేడుతో దాడి చేసిన సంఘటన ఇక్కడి గాజులరేగలో సోమవారం జరిగింది. ఎస్.కోటకు చెందిన ఎంబిఎ విద్యార్థి విక్రమ్ కొంతకాలంగా గాజులరేగకు చెందిన యువతి వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంటికి తన కుటుంబ సభ్యులను పంపాడు. విక్రమ్‌తో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు సమ్మతించలేదు. దీంతో బ్లేడుతో దాడి చేసేందుకు ఆమె ఇంట్లోకి విక్రమ్ చొరబడ్డాడు.

07/25/2016 - 18:31

విశాఖ: చెన్నైలోని తాంబరం వద్ద అదృశ్యమైన విమానంలో వెళుతూ ఇంతవరకూ జాడలేకుండా పోయిన ఎన్‌ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి సోమవారం పరామర్శించారు. విమానం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నందున అధైర్య పడవద్దని ఆయన అన్నారు. మర్రిపాలెం, బుచ్చిరాజుపాలెం, మాధవధార తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

07/25/2016 - 12:47

విజయవాడ: మనం-వనం కార్యక్రమంలో భాగంగా ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించుకునేలా ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తామన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ను సాకారం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

07/25/2016 - 08:19

కడప, జూలై 24: శేషాచలం అడవిలో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఓఎస్‌డి సత్యయేసుబాబు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా గమనించిన ఎర్ర చందనం కూలీలు మారణాయుధాలతో దాడులకు దిగడంతో పోలీసులు ఏడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

07/25/2016 - 08:18

నెల్లూరు, జూలై 24:‘ఆంధ్రప్రదేశ్ నన్ను దత్తత తీసుకుంది. నేను ఆంధ్రుల దత్తపుత్రుణ్ని, జీవితాంతం కొత్త రాష్ట్భ్రావృద్ధికి శాయశక్తులా సహకరిస్తా’ అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరు నగరంలో ఆయన రైల్వే సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

07/25/2016 - 07:18

విజయవాడ, జూలై 24: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘనంగా మర్యాదలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర, టిటిడి దేవస్థానం భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

07/25/2016 - 07:13

విశాఖపట్నం, జూలై 24:‘నాకిది పునర్జన్మ. మళ్లీ భార్యాబిడ్డల్ని చూస్తాననుకోలేదు. నా విడుదలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నా సంస్థకు చెందిన అధికారులు చూపిన చొరవ మరువరానిద’ని నైజీరియాలో కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆదివారం వైజాగ్ చేరుకున్నారు. శ్రీనివాస్‌తోపాటు అవినాశ్ అనే మరో ఇంజనీర్‌ను కూడా నైజీరియాలో దుండగులు కిడ్నాప్ చేసి, 18 రోజులపాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే.

Pages