S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/24/2016 - 03:20

హైదరాబాద్, జూలై 23:మిత్రపక్షం, ప్రతిపక్షం, తెదేపా అనుకూల మీడియా కలసి ప్రత్యేక హోదాపై తమను ముద్దాయిగా నిలబెట్టాయని బిజెపి అంతర్మధనం చెందుతోంది. బిల్లు ఓటింగు వరకూ రాదని తెలిసినప్పటికీ, రాష్ట్రంలో ఎదురుదాడి, ఆత్మరక్షణ ఏవిధంగా ఉండాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం కరవయిందన్న ఆగ్రహం బిజెపి నేతల్లో వ్యక్తమవుతోంది.

07/24/2016 - 01:28

విజయవాడ, జూలై 23: నూతన ఇన్‌చార్జి డిజిపిగా పదవి చేపట్టిన నండూరి సాంబశివరావు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని శనివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎంకి పుష్పగుచ్చం అందజేశారు. నండూరి సాంబశివరావు నవ్యాంధ్రప్రదేశ్ అగ్నిమాపకశాఖ డీజిగా మెరుగైన సంస్కరణలు చేపట్టడంతోపాటు ప్రప్రథమంగా రాష్ట్ర స్థాయి అగ్నిమాపక కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేశారు.

07/23/2016 - 18:06

విశాఖ: సీఎం చంద్రబాబు శనివారం బ్రాండెక్స్‌ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలని, కార్మికులు బాగుండాలని చెప్పారు. బ్రాండెక్స్‌ కార్మికులకు రూ.1000 పెంచేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. జీతాల పెంపుపై కమిటీ వేశామని, కమిటీ సూచన మేరకు జీతాల పెంచుతామని ఆయన పేర్కొన్నారు.

07/23/2016 - 18:00

పోలవరం (ప.గో): చర్చలు సఫలం కావడంతో పోలవరం ప్రాజెక్టు కార్మికులు విధులకు హాజరైనారు. పోలవరం ప్రాజెక్టు కార్మికులతో ఇంచార్జ్‌ సీఈ రమేష్‌బాబు చర్చలు సఫలమయ్యాయి. రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించేందుకు, ఆగస్టు 15 నాటికి అన్ని బకాయిలు పూర్తిచేస్తామని వెల్లడించారు.

07/23/2016 - 17:43

ఒంగోలు: ఒంగోలు జనార్దన్‌కాలనీలో మూగ యువతిపై దుండగులు శనివారం నాడు సామూహిక అత్యాచారం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు పై పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.

07/23/2016 - 16:50

వరంగల్: వైద్యుడి అవతారంలో ఓ నర్సు గర్భిణికి కాన్పు చేయగా శిశువు మరణించిన ఘటన వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. ఈ ఆస్పత్రిలో వైద్యుడు స్థానికంగా లేకపోవడంతో గర్భిణికి నర్సు కాన్పు చేయించింది. ప్రసవం అనంతరం శిశువు మరణించడంతో గర్భిణి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్లు అందుబాటులో లేనందునే ఈ ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

07/23/2016 - 16:49

అనంతపురం: ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో జీపును ఓ లారీ ఢీకొనడంతో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్పించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నాటకలోని నళమంగళకు చెందిన 11 మంది తిరుమల వెళ్లేందుకు జీపులో బయలుదేరారు. ముంబయి-చెన్నై రహదారిపై వీరు ప్రయాణిస్తున్న జీపును టమాటాల లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది.

07/23/2016 - 15:16

విశాఖ: నగరంలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఆర్టీసీ, బస్సు, జీపు ఢీకొన్న సంఘటన తల్లి, కుమార్తెలను బలితీసుకుంది. ఈ వాహనాల మధ్య తల్లీకూతుళ్లు వెళుతున్న బైక్ నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

07/23/2016 - 13:54

విశాఖ: డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 100 మీసేవా కేంద్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రూ.8.30కోట్ల వ్యయంతో వుడా అభివృద్ధి చేసిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

07/23/2016 - 12:35

చిత్తూరు: ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందని తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. వెదురుకుప్పం మండలం గొడుగుచింతలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని గాయత్రి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆమెను తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి తన వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

Pages