S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/28/2015 - 11:29

విజయవాడ: చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నూజివీడులోని ట్రిపుల్ ఐటి లెక్చరర్లు శనివారం ఆందోళన ప్రారంభించారు. వీరంతా విధులను బహిష్కరించటంతో పరీక్షలు నిలిచిపోయాయి.

11/28/2015 - 11:29

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థి గణేశ్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువకుడు కొద్ది రోజులుగా కనిపించటం లేదు. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గణేశ్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

11/28/2015 - 11:28

నెల్లూరు: అనుమానం పెనుభూతం కావడంతో భార్యను కత్తితో నరికి చంపి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన విడవలూరు మండలం రామతీర్థంలో శనివారం వెలుగు చూసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

11/28/2015 - 11:28

రాజమండ్రి: కూనవరం మండలం ముల్లూరులో శనివారం ఉదయం ముగ్గురు యువతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వెంటనే వీరిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

11/28/2015 - 11:27

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగటంతోపాటు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాబోయే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను ఎ.పి. ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

11/28/2015 - 11:27

కాకినాడ: రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆదిత్య మరణించగా, ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలోని గీతం కళాశాలలో చదువుతున్న ఆదిత్య స్వస్థలమైన తిరుపతి వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగింది.

11/28/2015 - 11:26

నెల్లూరు: కోవూరు వద్ద పెన్నానదిలో శనివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు.

11/28/2015 - 11:25

హైదరాబాద్: దాదాపు నెల రోజుల విరామం అనంతరం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శనివారం ఉదయం ఇక్కడి సచివాలయానికి వచ్చి వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. వివిధ సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాలకు సంబంధించి ఆయన ఆరా తీశారు. పలువురు మంత్రులు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

11/28/2015 - 11:24

ఒంగోలు: ఒంగోలు పట్టణంలో శనివారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయాందోళనలకు గురై ఇళ్లల్లోంచి పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.

11/27/2015 - 13:48

నెల్లూరు : ఆనం సోదరులు టిడిపిలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శుక్రవారంనాడు ఆనం సోదరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతోనే టిడిపిలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే తమ లక్ష్యమని వెల్లడించారు.

Pages