S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2016 - 18:22

విజయవాడ: ఇతర కులాలను బిసి జాబితాలో చేర్చరాదంటూ బిసి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ పెద్దఎత్తున ర్యాలీ జరిపారు. బిసి కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా తోపులాట జరిగింది.

07/22/2016 - 17:38

విజయవాడ: కృష్ణానది పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఎపి సిఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. నిన్న పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన ఆయన ఈరోజు అధికారులతో సమీక్ష జరిపారు. సీతానగరం వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు జరగాలన్నారు.

07/22/2016 - 17:26

విశాఖ: ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. ఛత్తీస్‌గడ్, విదర్భ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణశాఖ తెలిపింది.

07/22/2016 - 17:44

విజయవాడ: ఏపీలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌, నెల్లూరు కలెక్టర్‌గా ముత్యాలరాజు, విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌గా హరినారాయణ , చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా గిరీశ్‌ షా, పాడేరు ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీడీగా శివశంకర్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.

07/22/2016 - 17:19

విజయవాడ: కృష్ణానదిలో మత్స్యకారులకు శుక్రవారం వింత చేపలు దొరికాయి. ఈ చేపల నిండా ముళ్లు ఉండడంతో వీటిని రాక్షస, దెయ్యం చేపలని మత్స్యకారులు అంటున్నారు. వలలు ధ్వంసం కావడంతో వేటకు వెళ్లడం మానేశారు. ఇలాంటి చేపలు ఎన్నడూ చూడలేదని అంటున్నారు.

07/22/2016 - 15:59

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆరోపించారు. ఆప్‌ సభ్యుడిపై చర్చకు కాంగ్రెస్‌ సహకరించి ఉంటే గంటన్నర తర్వాత ప్రైవేటు బిల్లుపై చర్చకు అవకాశం వచ్చేదన్నారు. గందరగోళం సృష్టించి సభ వాయిదా పడేలా కాంగ్రెస్‌ చేసిందన్నారు.

07/22/2016 - 15:19

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా సాధించాలన్న విషయంలో టిడిపికి చిత్తశుద్ధి లేదని, బిజెపిని ఒప్పించడంలో ఆ పార్టీ విఫలమైందని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కెవిపి ప్రతిపాదించిన బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని, ఈ విషయంలో ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధమేనన్నారు.

07/22/2016 - 15:18

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు బిజెపి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ పార్టీకి మనుగడ కష్టమేనని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి అన్నారు. రాజ్యసభకు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంతో ఆయన సినిమా షూటింగ్ వాయిదా వేసుకుని హుటాహుటిన దిల్లీ చేరుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ప్రైవేటు బిల్లుకు సహకరించాలన్నారు.

07/22/2016 - 15:15

గుంటూరు: ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకు ఇకపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తాజా సమాచారాన్ని అందిస్తామని ఎపిపిఎస్‌సి చైర్మన్ ఉదయ్‌భాస్కర్ శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. తమ వెబ్‌సైట్‌లో ఉద్యోగార్థులు ఒకసారి వివరాలు నమోదు చేసుకుంటే ప్రతిసారీ దరఖాస్తు చేయనవసరం లేదని, విద్యావంతుల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతామని వివరించారు.

07/22/2016 - 14:34

విజయవాడ: తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పోలవరం ప్రాజెక్ట్‌ సైట్‌ ఆఫీస్‌ దగ్గర ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఉద్యోగులు మూడు రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి.

Pages