S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/22/2016 - 14:27

హైదరాబాద్: కర్నూలులో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు అవినాష్‌రెడ్డి, రఘురాంరెడ్డి శుక్రవారం సీఎస్ టక్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 874 అడుగుల నీరు చేరేవరకు కిందకు విడుదల చేయరాదని, తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని కోరారు.

07/22/2016 - 14:22

విజయవాడ: కంచికచర్ల మండలం దొనబండ దగ్గర గ్రానైట్‌ క్వారీలో శుక్రవారం బ్లాస్టింగ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

07/22/2016 - 14:14

విజయవాడ: 4,548 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఏపీ డీజీపీ రాముడు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీజీపీ తెలిపారు.

07/22/2016 - 12:29

విజయవాడ: పట్టిసీమ సాగునీటి ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి కృష్ణాడెల్టాను ఆదుకున్నామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. కృష్ణాడెల్టా ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు, అధికారులతో ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పంటలు సమృద్ధిగా పండి పల్లెల్లో పండగ శోభ నెలకొనడం ఖాయమన్నారు. ప్రతి రైతు కళ్లలో ఆనందం కనపడాలన్నదే తన ధ్యేయమన్నారు.

07/22/2016 - 12:27

విజయవాడ: చిట్టీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసిన ఓ మహిళ కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నూజివీడులో నాగరత్నం అనే మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది నుంచి కోటిరూపాయల మేరకు వసూలు చేసింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగరత్నం ఇంటి ముందు వారు ధర్నాకు దిగారు.

07/22/2016 - 04:21

విజయవాడ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తాత్కాలిక భవన నిర్మాణానికి గురువారం రాష్ట్ర డిజిపి జెవి రాముడు శంకుస్థాపన చేశారు. విజయవాడలోని బందరురోడ్డులో ఉన్న రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ భవనం పక్కనే ఉన్న స్థలంలో రాష్ట్ర తాత్కాలిక భవన నిర్మాణం జరుగునుంది.

07/22/2016 - 04:18

హైదరాబాద్, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు వేదికగా వాగ్దానం చేశారని, ఈ బాధ్యత పార్లమెంటుకే ఉందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలకు అతీతంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఈ హామీని నెరవేర్చాలిన బాధ్యత ఉందన్నారు. దీనిపై ప్రత్యేకంగా బిల్లు అవసరం లేదన్నారు.

07/22/2016 - 04:17

న్యూఢిల్లీ, జూలై 21: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేంద్రం పార్లమెంట్ బిల్లు పెడితే సీపీఐ పార్టీ బేషరతుగా మద్దతు పలుకుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడు నారాయణ స్పష్టంచేశారు. వివిధ బిల్లులను పాస్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం ఏపీకి పార్లమెంట్‌లో ఇచ్చిన ప్రత్యేక హోదాపై అందరి మద్దతు ఎందుకు కూడ గట్టడం లేదని ప్రశ్నించారు.

07/22/2016 - 04:16

హైదరాబాద్, జూలై 21 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘నాలెడ్జ్ హబ్’గా రూపొందిస్తున్నామని ఎపి మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇందులో భాగంగానే రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు కాలేజీలను, వచ్చే సంవత్సరం మరో కాలేజీని కొత్తగా ప్రారంభిస్తున్నామన్నారు.

07/22/2016 - 04:16

హైదరాబాద్, జూలై 21 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) కు 2,586 కోట్ల రూపాయలను కేటాయించామని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, మరో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని 27 పద్దుల కింద ఖర్చు చేస్తామన్నారు.

Pages