S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/21/2016 - 18:21

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయనను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సాంబశివరావు డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

07/21/2016 - 17:38

తిరుమల : తిరుమల రెండో ఘాట్ పదో మలుపు వద్ద గురువారం సాయంత్రం పది మంది భక్తులతో తిరుమలకు బయలుదేరిన బోలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఏడుగురికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది.

07/21/2016 - 16:38

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైకాపా నేత బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. ఎపికి ప్రయోజనం కలగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా, ప్రత్యేక హోదా విషయంలో సిఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని బొత్స ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.

07/21/2016 - 16:37

అనంతపురం: ఇక్కడి రుద్రంపేట జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పాతకక్షల కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను వెంకటేష్ నాయక్, గోపీ నాయక్‌లుగా స్థానికులు గుర్తించారు.

07/21/2016 - 16:37

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల నిర్మాణం, ఇతర పనులు మందకొడిగా సాగుతున్నాయని ఎపి సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతానగరం వద్ద పనులను ఆయన గురువారం పరిశీలించి ఇంకా పనులు పూర్తికానందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. సకాలంలో నాణ్యతతో పనులు పూర్తయ్యేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. పనులను పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు.

07/21/2016 - 14:35

విజయవాడ: ఎపిలో కొత్తగా మంజూరైన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటిల్లో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 31న మెరిట్ లిస్టు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ రెండు ట్రిపుల్ ఐటిలను ఈ ఏడాదికి నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ రెండు సంస్థల్లో ఆంధ్ర ప్రాంతానికి 1230 సీట్లు, రాయలసీమకు 770 సీట్లు కేటాయిస్తున్నామన్నారు.

07/21/2016 - 12:42

విశాఖ: పరవాడ మండలం తానాం వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రైలు వస్తున్న విషయాన్ని ఆమె గమనించక పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని సమాచారం.

07/21/2016 - 12:41

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో తీర్చిదిద్దిన శ్రీవేంకటేశ్వర స్వామి నమూనా ఆలయం ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. నమూనా ఆలయ నిర్మాణం పనులను టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు గురువారం ఉదయం పరిశీలించారు. 7వ తేదీ నుంచే ఈ ఆలయంలో భక్తులను అనుమతిస్తామని, తిరుమలలో జరిగినట్టే నిత్యపూజులు, విశేష సేవలను నిర్వహిస్తామన్నారు. వెయ్యిమంది వరకూ సభ్యులున్న సేవాబృందాలు పాల్గొంటాయన్నారు.

07/21/2016 - 07:54

విశాఖపట్నం, జూలై 20: విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను నౌకాదళ సేవల నుంచి త్వరలో ఉపసంహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఆ నౌకను మ్యూజియంగా తీర్చిదిద్దే వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెల 23న ముంబయి నుంచి ఆఖరి సారిగా కొచ్చిన్‌కు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

07/21/2016 - 07:54

విజయవాడ, జూలై 20: తెలుగువారు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని, మనవాళ్లు ఎక్కడ అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకుని ముందంజలో ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం సిఎంఓలో విదేశీ విద్యార్థి దీవెన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కాపు కార్పొరేషన్ ఎంపిక చేసిన 145 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Pages