S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/19/2016 - 12:03

ఏలూరు: తాగుడుకు బానిసైన భర్త నిత్యం నరకయాతన పెడుతున్నందున విసుగెత్తిన ఓ ఇల్లాలు తన నాలుగేళ్ల కుమార్తె చేత పురుగుమందు తాగించి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ముదునూరులో మంగళవారం ఉదయం ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. భర్త దుర్గాప్రసాద్ పెడుతున్న చిత్రహింసలను భరించలేక అశ్విని తన కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

07/19/2016 - 04:35

సింహాచలం, జూలై 18: కృతయుగ దైవం వరాహ నారసింహుడు కొలువైవున్న సింహాచలం భక్తజన సంద్రమైంది. ఆషాఢ పౌర్ణమి ఉత్సవంలో భాగంగా సోమవారం సింహగిరి ప్రదక్షిణకు తరలివచ్చిన భక్తకోటి హరినామస్మరణతో సింహాచలం మారుమోగింది. వైభవోపేతంగా జరిగిన సింహగిరి ప్రదక్షిణ వేడుకను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు టెంకాయ కొట్టి, జండా ఊపి రథయాత్ర ప్రారంభించారు.

07/19/2016 - 04:33

కర్నూలు/పాములపాడు, జూలై 18: విశాఖపట్టణం మహానగరంలోని వీధి దీపాలను సెన్సర్లతో అనుసంధానం చేశామని, తద్వారా ఎక్కడ ఏ దీపం వెలుగుతోందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

07/19/2016 - 04:31

విశాఖపట్నం, జూలై 18: అధికారం ఉందన్న అహంకారంతోనే పాల్మన్‌పేట మత్స్యకారులపై తెలుగుదేశం నేతలు దాడులకు తెగబడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పాల్మన్‌పేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన రెండు వర్గాల మధ్య దాడుల ఘటనలో బాధిత కుటుంబాలను సోమవారం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా పాల్మన్‌పేట మత్స్యకారులను జగన్ ఓదార్చారు.

07/19/2016 - 04:28

కాకినాడ రూరల్, జూలై 18: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ రూరల్ మండలంలో తాజాగా కల్తీ ఆయిల్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పెట్రోల్, డీజిల్ కంటే చౌకగా లభించే నాఫ్తాను పెట్రోల్ బంకుల్లో కలిపి విక్రయించే ఈ ముఠాపై అందిన సమాచారం మేరకు కాకినాడ రూరల్ సిఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో ఐడి పార్టీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి మెరుపుదాడిచేశారు.

07/19/2016 - 04:04

హైదరాబాద్, జూలై 18: రెండేళ్ల తెలుగుదేశం పాలనలో అడుగడుగునా అవినీతి. అసలు కొన్ని పథకాలున్నాయని తెలియని ఆశ్చర్యం. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీలతోపాటు, బ్యాంకుల్లో కుదవ పెడుతున్న బంగారం అమ్మకాలపై సెంటిమెంటుతో కూడిన ఆగ్రహం. జన్మభూమి కమిటీలు పార్టీ కమిటీలవుతున్నాయన్న విమర్శ. అవినీతి విషయాలు పట్టని గ్రామీణం. ఇదీ గడపగడపకూ వైసీపీలో ఇచ్చిన వంద ప్రశ్నలకు వస్తున్న జవాబులు!

07/19/2016 - 03:58

హైదరాబాద్, జూలై 18: భారత్‌లో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన పట్టణాలు రూపాంతరం చెందుతున్న తీరు, సవాళ్లు, పరిష్కారాలు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు అమెరికా హోం శాఖ ప్రతినిధిగా డాక్టర్ అనురాధ రామస్వామి ఈ నెల 25 నుండి విశాఖ పర్యటించనున్నారు. భారత్‌లో జైపూర్, అజ్మీర్, అలహాబాద్, విశాఖ నగరాలను ఆమె సందర్శిస్తారు.

07/19/2016 - 03:58

న్యూఢిల్లీ, జూలై 18: ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు మద్దతు అడిగే ముందు విభజన చట్టంలో దాన్ని ఎందుకు పెట్టలేదో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు సమాధానం చెప్పాలని టిడిపి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో ఎపికి అన్యాయం చేసిందని విమర్శించారు. హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన వెల్లడించారు.

07/19/2016 - 03:57

పలాస, జూలై 18: ఈ పాడులోకంలో బతకలేనని రెండేళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓ బాలిక సోమవారం సాయంత్రం మరణించడంతో తాళభద్రలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాళభద్రకు చెందిన ఎస్.శ్రావణి (14) 7వ తరగతి విద్యార్థిని. ఆ గ్రామానికే చెందిన హరిజగదీష్, షణ్ముఖరావు, రాజ్‌కుమార్ లైంగికంగా వేధించడంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

07/19/2016 - 03:56

విజయవాడ, జూలై 18: డిజిపి రాముడు పదవీ కాలాన్ని రెండు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన జరిగిన తరువాత రెండో డిజిపిగా రాముడు బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. రాముడు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే వచ్చే నెలలో పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాముడు పదవీకాలాన్ని రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Pages