S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2016 - 07:57

కడప, జూలై 17: రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిసారిగా పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నామని, అందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకటరాముడు స్పష్టం చేశారు. ఇక నుంచి పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో 5 కి.మీ పరుగు పందెం స్థానంలో 1 లేదా 2 కి.మీ పరుగు పందెం పరీక్ష మాత్రమే ఉంటుందని తెలిపారు.

07/18/2016 - 07:56

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూలై 17: వేద వేదాంత వనవాసిని శ్రీ కనకదుర్గమ్మ వివిధ రకాలైన శాకములను (కూరగాయలను) సర్వాభరణాలుగా ధరించి చిరుమందహాసంతో ప్రశాంతత కలిగించే శాకాంబరీదేవి అలంకారంలో ఆదివారం భక్తులకు దివ్య దర్శనమిచ్చింది.

07/18/2016 - 07:55

విజయవాడ, జూలై 17: అమరావతి ప్రజా రాజధాని అంటూ ఏపీ సర్కారు చెబుతున్న మాటలు అక్షర సత్యాలు కాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెబుతున్నట్టుగా అమరావతి అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వినోదం, పరిశ్రమలు.. అన్నీ కలబోతగా ఉండాలన్న లక్ష్యం దిశగా ఇప్పుడు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతిలో విద్యాసంస్థల భూకేటాయింపులకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

07/18/2016 - 07:54

రాజమహేంద్రవరం, జూలై 17: నదుల అనుసంధానంలో భాగంగా ఉత్తరాంధ్రాలోని వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేసే ప్రాజెక్టులను శరవేగంగా చేపట్టామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/18/2016 - 07:44

గన్నవరం, జూలై 17: అమెరికా వెళ్లిన తన భర్త జాడ తెలియజేయాలని భార్య కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. గన్నవరానికి చెందిన పాస్టర్ వీరపనేని జాన్సన్ చౌదరి(44) జూన్ 4న అమెరికా వెళ్లాడు. జూలై 15న అమెరికా నుండి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆయన ఈనాటి వరకు ఇంటికి చేరుకోలేదని అతని భార్య సుభాషిణి గన్నవరం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

07/18/2016 - 07:10

హైదరాబాద్, జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కింద వాహనదారుల నుంచి రూ. 44.69 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ ఏడాది ఇంతవరకు అంటే జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు రూ. 16.83 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేశామని కోర్టుకు ఏపి ప్రభుత్వం తెలిపింది.

07/18/2016 - 07:07

రాజమహేంద్రవరం, జూలై 17: గోదావరి నది ఎడమ గట్టుపై మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.350 కోట్ల ప్రాథమిక అంచనాతో ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో ఏలేరు ప్రాజెక్టు కింద 90వేల ఆయకట్టుకు స్థిరీకరణ కానుంది. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం రాజమహేంద్రవరంలో ఈ ఎత్తిపోతల పథకం ప్రకటించారు.

07/18/2016 - 06:11

హైదరాబాద్, జూలై 17: ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరుగుతుందని విద్యుత్ రంగంపై ప్రభుత్వం నియమించిన యంగ్ అండ్ ఎర్నెస్ట్ సంస్థ నివేదికలో పేర్కొంది.

07/18/2016 - 06:11

హైదరాబాద్, జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ చేస్తున్న కృషి అంతా ఇంతాకాదు. కాని అమరావతి గ్రామ పంచాయితీ అభివృద్ధికి అంతంత మాత్రంగానే నిధులు విదుల్చుతున్నారని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. కృష్ణ పుష్కరాలు సమీపిస్తున్నా, ఇంతవరకు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.

07/18/2016 - 06:10

హైదరాబాద్, జూలై 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్లి, వాటిపై పార్టీముద్ర వేయడంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. మొత్తంగా పాసుమార్కులు సంపాదించిన ఎమ్మెల్యేలు 20-25 మంది మాత్రమే. ఇదీ తెలుగుదేశం నాయకత్వం రెండేళ్లలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై చేయించిన సర్వే ఫలితం.

Pages