S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/18/2016 - 05:03

నిజాంపట్నం, జూలై 17: గుంటూ రు జిల్లా నిజాంపట్నం మండలం మహ్మద్‌వారిపాలెంలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో నే హతమార్చి మృతదేహాన్ని అక్కడే వదిలేసిన సంఘటన సంచలనం రేపింది. వారికి గ్రామస్తులు దేహశుద్ధి చేయటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

07/18/2016 - 05:00

విజయవాడ, జూలై 17: మరో 25 రోజుల్లో కృష్ణానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి పుష్కరాల మాదిరి కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం ప్రచారం చేయకపోవడం గమనార్హం. గోదావరి పుష్కరాలకు రెండు నెలల ముందు నుంచే ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించింది. ఈ ప్రచారం వల్లనే కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు కోట్ల సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం పుష్కరాలకు ఏర్పాట్లను కూడా భారీయెత్తునే చేసింది.

07/18/2016 - 04:56

విశాఖపట్నం, జూలై 17: అమెరికా మెప్పు కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సైతం ప్రభుత్వాలు వెనుకాడటం లేదని, కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రమాదకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆరోపించారు.

07/17/2016 - 06:03

శ్రీకాకుళం, జూలై 16: అణు రియాక్టర్లలో చిన్న ప్రమాదం జరిగినా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్మశానాలవుతాయని సిపిఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ హెచ్చరించారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఆరు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయలేదని, కొవ్వాడలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

07/17/2016 - 06:01

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూలై 16: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మను ఆదివారం నుండి వివిధ రకాలైన కూరగాయలనే ఆభరణాలుగా అలంకరించి శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేశంలో పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఏటా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

07/17/2016 - 06:01

తిరుమల, జూలై 16: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఆదాయ వ్యయాలు, నిలువలు మొదలైన వాటికి సంబంధించిన వార్షిక లెక్కలను స్వామివారికి నివేదించారు.

07/17/2016 - 05:58

రాజమహేంద్రవరం, జూలై 16: జల రవాణా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. కాకినాడ నుంచి చెన్నై వరకు బకింగ్ హామ్ కెనాల్‌ను అనుసంధానం చేసుకుంటూ రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సగానికి పైగా సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టు సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఇప్పటికే నెల్లూరు వరకు సర్వే పూర్తయింది. నెల్లూరు నుంచి చెన్నై వరకు సర్వే కోసం టెండర్లు పిలిచారు.

07/17/2016 - 05:58

విజయవాడ, జూలై 16: డ్వాక్రా మహిళల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహిళలు ఆర్థికంగా శక్తివంతులైతే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏమేం అవకాశాలున్నాయో.. వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకునేలా పథక రచన చేస్తోంది.

07/17/2016 - 05:57

విశాఖపట్నం, జూలై 16: సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారంలో జాప్యం వాస్తవమేనని, న్యాయస్థానంలో చిక్కుల వల్లే పరిష్కారం ఆలస్యం అవుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో సింహాచలం భూ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఇచ్చిన హామీపై ఆయన విశాఖలో శనివారం విలేఖరుల వద్ద స్పందించారు.

07/17/2016 - 05:56

విజయవాడ, జూలై 16: రాయలసీమ కోసమే కోట్లాది రూపాయలతో పట్టిసీమ పథకాన్ని చేపట్టామని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ ఇప్పటికైనా రాయలసీమకు నీళ్లెప్పుడిస్తారో వెల్లడించాలని పిసిసి అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి డిమాండ్ చేసారు.

Pages