S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2016 - 14:28

గుంటూరు: నరసరావుపేటలో 12వ వార్డు టిడిపి కౌన్సిలర్ బాబూరావు, అతని అనుచరుడు అనిల్‌పై శనివారం తెల్లవారుజామున రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఈ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షతగాత్రులను పరామర్శించారు. నరసరావుపేటలో శాంతిభద్రతల పరిస్థితిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు స్పీకర్ తెలిపారు.

07/16/2016 - 14:25

నెల్లూరు: వేగంగా వెళుతున్న కారు పంటకాల్వలో పడి ఒకరు మరణించిన ఘటన వరికుంటపాడు మండలం జడదేవి గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

07/16/2016 - 14:25

విశాఖ: ఇద్దరు మావోయిస్టులతో పాటు ఏడుగురు మిలీషియా సభ్యులు శనివారం ఉదయం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సమక్షంలో లొంగిపోయారు. లక్ష రూపాయల రివార్డు ఉన్న మువ్వల కృష్ణ అలియాస్ నగేష్ అనే మావోయిస్టు నాయకుడు లొంగిపోయాడని ఎస్పీ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు ఎస్పీ చెప్పారు.

07/16/2016 - 14:24

విజయనగరం: ప్రభుత్వ ఆస్పత్రిలో సగం మంది వైద్యులు కూడా విధులకు రాకపోవడంపై మంత్రి మృణాళిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ 36 మంది వైద్యులుండగా, 12 మంది మాత్రమే విధుల్లో కనిపించడంపై మంత్రి విస్మయం చెందారు. మంత్రి వచ్చారని తెలిసి కొందరు వైద్యులు ఆస్పత్రి వెనుక ద్వారం నుంచి నెమ్మదిగా లోనికి ప్రవేశించారు.

07/16/2016 - 14:22

విజయవాడ: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఇక్కడ తెలిపారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ ఘటన సుఖాంతమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నాపైన రెండు రోజుల తర్వాత శిశువును తల్లిఒడికి చేర్చినందుకు పోలీసులను ఆయన అభినందించారు.

07/16/2016 - 12:14

విజయవాడ: పట్టిసీమ నుంచి ఈనెల 9న విడుదలైన గోదావరి జలాలు శనివారం ఉదయం కృష్ణానదిలో ప్రవేశించాయి. పట్టిసీమ ద్వారా 2350 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 182 కి.మీ దూరం నుంచి గోదావరి నీరు పవిత్ర సంగమంలోకి చేరాయి. గోదావరి జలాలకు రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.

07/16/2016 - 12:10

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన శిశువును పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి తల్లిఒడికి చేర్చారు. అవనిగడ్డలో ఓ యువతి వద్ద శిశువు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి శిశువును స్వాధీనం చేసుకున్నారు. శిశువును అపహరించినందుకు గంగు నాగమల్లేశ్వరి, రాజా అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వివరాలు రాబడుతున్నారు.

07/16/2016 - 11:58

తిరుమల: టీవీఎస్‌ మోటార్స్‌ అధినేత శ్రీనివాసన్‌ శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తితిదే అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్లను విరాళంగా ఈవో సాంబశివరావుకు చెక్కును అందజేశారు.

07/16/2016 - 08:11

విజయవాడ, జూలై 15:విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన పసికందు జాడ రెండు రోజులు గడిచినా తెలియరాలేదు. పసికందుకోసం ఆరు పోలీసు బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నా ఫలితం లేదు. ఇదిలాఉండగా ఆసుపత్రి సమీపంలోని ఏలూరు కాలువలో మగ శిశువు మృతదేహం ప్రత్యక్షం కావటంతో కొంతసేపు ఆసుపత్రిలో కలకలం రేగింది.

07/16/2016 - 07:29

అనంతపురం, జూలై 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అనంతపురం వేదిక కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం స్వాతంత్య్ర వేడుకలను సొంత రాష్ట్రంలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చందబాబునాయుడు ప్రకటించారు.

Pages