S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/02/2016 - 04:54

విజయవాడ, జూలై 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజు రోజుకూ తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఖండించారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ వచ్చిన చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.

07/02/2016 - 03:39

విజయవాడ, జూలై 1: రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఎపి పెట్టుబడిదారులంటే అవినీతిపరులన్న ముద్ర వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

07/02/2016 - 03:38

విజయవాడ, జూలై 1: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సాయం పెద్దగా లేదని తేలిపోయింది. అమరావతికోసం కేంద్రం కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తానందని శుక్రవారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 1000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు.

07/02/2016 - 03:11

హైదరాబాద్, జూలై 1:అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు... ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది.

07/02/2016 - 03:07

ఆదోని, జూలై 1: దేశంలో టెక్‌టైల్స్ పరిశ్రమ, జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలకు అవసరమైన పత్తి ముడిసరుకు నిల్వలు నిండుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 40 రోజులకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నట్లు పత్తి వ్యాపారుల సంఘం అంచనా వేసింది. దీంతో పత్తి, దూది ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వ్యాపారవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. నెల రోజుల క్రితం క్వింటాల్ పత్తి ధర రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు ఉండేది.

07/01/2016 - 18:18

విజయవాడ: వైకాపా అధినేత జగన్ తన ఆస్తుల జప్తులకు సంబంధించి ప్రజలకు అన్ని వివరాలు తెలపాలని మంత్రి దేవినేని అన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల జప్తు గురించి వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. కాగా, కేంద్రం తగినన్ని నిధులిస్తే ఎపిలో హైకోర్టును ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనన్నారు.

07/01/2016 - 18:17

విజయవాడ: చైనా పర్యటన ముగించుకుని వచ్చిన ఎపి సిఎం చంద్రబాబు ఈ నెల 10 నుంచి రష్యాలో పర్యటిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఆయన ఇటీవలి కాలంలో పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. రష్యాలో జరిగే అంతర్జాతీయ ఎయిర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

07/01/2016 - 18:17

విజయవాడ: విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఎపికి హైకోర్టు ఏర్పాటుచేసే బాధ్యత కేంద్ర హోంశాఖదేనని కేంద్రమంత్రి సుజనా చౌదరి శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. హైకోర్టు ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించిందన్నారు. హైకోర్టు విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

07/01/2016 - 17:37

తిరుమల: గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తితిదే విడుదల చేసింది. 1,09,092 సేవా టికెట్లను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల కోసం అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది. 26,600 సహస్ర దీప అలంకరణ, 12,476 సుప్రభాత సేవ, 2,952 నిజపాద సేవ, 24,080 వసంతోత్సవ టికెట్లను అంతర్జాలంలో వుంచారు.

07/01/2016 - 16:18

రాజమండ్రి: బయటి వ్యక్తులు వచ్చి తమ కళాశాలలో దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమపై తప్పుడు కేసులు పెట్టారని స్థానిక ఆదిత్య కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులను వెంటబెట్టుకుని అర్బన్ ఎస్పీ రాజకుమారిని ఎమ్మెల్యే సత్యనారాయణ కలిశారు.

Pages