S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/26/2016 - 06:56

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో 39, 40, 41, 42,43లను శనివారం నాడు విడుదల చేసింది. ఇంజనీరింగ్‌లో గరిష్టంగా రూ.

06/26/2016 - 06:51

భీమవరం, జూన్ 25: బుల్లెట్ ట్రైన్ వేగంతోప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. తాను ప్రధానమంత్రిని కాదని దేశంలోని తొలి ప్రజాసేవకుడినని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించి భారత్‌మాతాకి జై అని నినదించి దేశం మీద గౌరవాన్ని మరింత పెంపొందిస్తున్నామన్నారు.

06/26/2016 - 06:49

గుంటూరు, జూన్ 25: హైదరాబాద్ నుంచి తరలివచ్చిన వ్యవసాయశాఖ కమిషనరేట్ ఉద్యోగులకు భార్యాపిల్లలతో సహా స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. గుంటూరులో ఏర్పాటుచేసిన వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను శనివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్‌బాబులు ప్రారంభించారు.

06/26/2016 - 06:45

కాకినాడ, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఇక్కడ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును అమలుచేయనున్నట్టు కాకినాడ ఎంపి, లోక్‌సభలో టిడిపి ఫ్లోర్ లీడర్ తోట నరసింహం చెప్పారు. దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా గుర్తించగా వీటిలో 20 నగరాలను తొలుత స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన పోటీలో కాకినాడ ఎంపిక కావడం విశేషమని అన్నారు.

06/26/2016 - 06:43

హైదరాబాద్, జూన్ 25: : చప్పగా రూపొందించిన రాజకీయ తీర్మానం.. తెదేపాతో పార్టీ వైఖరి ఎలా ఉండాలో తేలని అస్పష్టత.. ఎండోమెంట్ భూముల లీజులపై మంత్రితో నేతల వాగ్వాదం..రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పాగా.. మీడియాలో లీకు కథనాలపై అధ్యక్షుడి ఆగ్రహంతో రెండు రోజుల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి.

06/26/2016 - 06:41

విశాఖపట్నం, జూన్ 25: స్మార్ట్‌సిటీ ప్రతిపాదనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో విశాఖలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హంగామాగా మిగిలింది. ప్రధాని మోదీ, గతేడాది ఇదే రోజున తొలి దశలో 20 స్మార్ట్‌సిటీలను ఎంపిక చేశారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో స్మార్ట్ పనులు చేపట్టేందుకు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది.

06/26/2016 - 06:40

మచిలీపట్నం, జూన్ 25: సమాచార హక్కు చట్టం కమిషనర్ ముందు సకాలంలో హాజరుకానందుకు, ఫిర్యాదుదారు కోరిన సమాచారం ఇవ్వనందుకు జిల్లా రిజిస్ట్రార్ బి శివరామ్‌కు రూ.10వేలు జరిమానా విధిస్తూ శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. ఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు.

06/26/2016 - 06:38

యాడికి, జూన్ 25: అనంతపురం జిల్లా తాడిపత్రిలో శనివారం పోలీసులు 11 మంది సభ్యుల దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి రూ.11.37 లక్షల దొంగ నోట్లు, రూ.1.10 లక్షల అసలు నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో దొంగనోట్ల ముఠాను అరెస్టు చేసినట్లు డిఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.

06/26/2016 - 06:38

దేవరాపల్లి, జూన్ 25: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వెంకట్రాజపురం సమీపంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో పిడుగు పడడంతో 26 మేకలు మృతి చెందాయి. పిడుగు పడిన సమయంలో సుమారు 130 వరకు మేకలు ఒక చింతచెట్టు కింద ఉన్నాయి. ఆ చెట్టుపై పిడుగు పడడంతో అందులో 26 మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. అదే చెట్టు తొర్రలో ఉన్న సబ్బి దేముళ్లు అనే వ్యక్తి వీపు పూర్తిగా కాలిపోయింది.

06/26/2016 - 06:37

చిత్తూరు, జూన్ 25: రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి చెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం మండలం దళవాయి కొత్తపల్లెకు చెందిన ఫరానా(40), ఆమె కుమార్తె అల్లాస్(9) కుప్పంలో ఇంటికి సరుకులు తీసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Pages