S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/24/2016 - 12:07

హైదరాబాద్: ఈనెల 27లోగా ఎపి ఉద్యోగులంతా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సిబ్బంది తరలివెళుతున్నారు. ఏళ్ల తరబడి హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భారమైన హృదయాలతో ఎపి ఉద్యోగులు అమరావతి బాట పట్టారు. అయితే, అందరికంటే భిన్నంగా వాణిజ్యపన్నుల శాఖలో అధికారిణిగా పనిచేస్తున్న పద్మ సైకిల్‌పై అమరావతికి బయలుదేరారు.

,
06/24/2016 - 05:40

గుంటూరు, జూన్ 23: హైదరాబాద్‌లోని సచివాలయ ఉద్యోగుల తరలింపు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం రాత్రి వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఉద్యోగులు గుంటూరుకు చేరుకున్నారు.

06/24/2016 - 05:33

విజయవాడ, జూన్ 23: రాష్టమ్రంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం నగరంలో సిఎం క్యాంప్ కార్యాలయంలో జరగనుంది. ప్రధానంగా ఉద్యోగుల తరలింపు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, చైనా పర్యటనపై సమీక్ష జరగనున్నట్లు తెలియవచ్చింది.

06/24/2016 - 05:32

విజయవాడ, జూన్ 23: వ్యవసాయం, జలశుద్ధి అంశాల్లో తాము అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టేందుకు ఆస్ట్రియా దేశం ముందుకొచ్చింది. ఏపిలో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశానికి చెందిన పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారని ఆస్ట్రియా ఉప రాయబారి జార్ట్ జెట్నర్ తెలిపారు.

06/24/2016 - 05:31

తిరుమల, జూన్ 23: తిరుమల కొండపై పాపవినాశనం రోడ్డులోని టిటిడి కల్యాణ వేదికవద్ద గురువారం భారీ కొండచిలువ హల్‌చల్‌చేసింది. బుధవారం భారీ నాగుపాము కన్పించడంతో భయబ్రాంతులకు గురైన భక్తులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పది అడుగుల కొండచిలువ గంటసేపు ఆ ప్రాంతంలో సంచరించడంతో మరింత భయభ్రాంతులకు గురయ్యారు.

06/24/2016 - 05:31

విజయవాడ, జూన్ 23: రాష్ట్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలివస్తున్నారు కదాయని అత్యాశతో అద్దెలు పెంచవద్దు.. అవసరమైతే రెంట్ కంట్రోల్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకురావల్సి వస్తుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితేనేమి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అప్రతిహతంగా వెలిసిన ఆకాశహర్మ్యాలలోని ప్లాట్లలో అద్దెలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది.

06/24/2016 - 05:30

కాకినాడ, జూన్ 23: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు నేతలను ఒక తాటిపైకి తీసుకురావడానికి కాపు జెఎసి సన్నాహాలు ప్రారంభించింది. పార్టీలకు అతీతంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను ఒక వేదికపైకి తీసుకురావాలని జెఎసి నేతలు యోచిస్తున్నారు.

06/24/2016 - 05:26

విజయవాడ, జూన్ 23: కృష్ణానది ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతుంటే దాన్ని అరికట్టకుండా తెలుగు రాష్ట్రాలు కీచులాడుకుంటూ రైతాంగాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

06/24/2016 - 05:25

కర్నూలు, జూన్ 23 : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌ను తెలంగాణకు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధికి అయిన ఖర్చులో ఏపి వాటా ఇస్తారా అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ప్రశ్నించారు. గురువారం ఇక్కడ మీడి యాతో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాసిన కెసిఆర్ ఉమ్మడి ఆస్తుల విషయం కూడా చెప్పి ఉంటే బాగుండేదన్నారు.

06/24/2016 - 05:24

విజయవాడ, జూన్ 23: అమరావతి అమరేశ్వరస్వామి ఆలయ అనుబంధ సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83 ఎకరాల భూముల వేలంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినందున తక్షణం ఆ వేలాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలని, ఈ వ్యవహారంపై సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధికార పక్షంలో భాగస్వామి అయిన బిజెపి ప్రత్యక్ష పోరుకు నడుం కట్టింది.

Pages