S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/24/2016 - 05:22

హిందూపురం, జూన్ 23: తరగతిగదిలో అల్లరి చేస్తోందన్న కారణంగా ఓ ఐదో తరగతి విద్యార్థిని పళ్లూడగొట్టాడు ఓ ఉపాధ్యాయుడు. అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై గురువారం విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. పూలకుంటలోని ప్రైవేటు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థిని తరగతి గదిలో అల్లరి చేస్తుండగా బుధవారం సాయంత్రం ఉపాధ్యాయుడు తేజోనాథ్ స్టీల్ స్కేల్ విసిరారు.

06/24/2016 - 05:22

మంగళగిరి, జూన్ 23: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ శివారులోని ఎర్రబాలెం వద్దగల ఆప్కో మండల వాణిజ్య కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర చేనేత, ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆప్కో మండల వాణిజ్య కార్యాలయంలో కొంత భాగాన్ని కమిషనర్ కార్యాలయానికి కేటాయించారు.

06/24/2016 - 05:19

బళ్ళారి, జూన్ 23: కర్నాటక రాష్ట్రం బళ్ళారి నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్‌శాఖ ఎఇగా పనిచేస్తున్న నాగరాజు(38) తన భార్య రత్నమ్మ(32), ఇద్దరు కూతుళ్లు పావని(6), ధనుశ్రీ(4)కు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం బళ్ళారి నగరంలోని బండిహట్టిలో నివాసముంటున్న నాగరాజు విద్యుత్‌శాఖ(జెస్కాం)లో ఎఇగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు.

06/24/2016 - 05:18

అరకులోయ, జూన్ 23: గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు హిందూ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తాయని ప్రముఖ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పేర్కొన్నారు.

06/24/2016 - 05:16

రాజమహేంద్రవరం, జూన్ 23: గోదావరి పుష్కరాల తొలి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ సోమయాజులు ఏక సభ్య కమిషన్ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో నిర్వహించిన విచారణకు ప్రభుత్వం తరపు న్యాయవాది సిహెచ్ ప్రభాకరరావు కమిషన్ సూచించిన వివరాలు సమర్పించలేకపోయారు.

06/23/2016 - 18:11

అనంతపురం: 4.14 కోట్ల రూపాయల విలువ చేసే పట్టుచీరలను కొనుగోలు చేసి బకాయి పడ్డ కళానికేతన్ ఎండి వేములూరి లీలాకుమార్‌ను ధర్మవరం పోలీసులు కర్నూలులో గురువారం అరెస్టు చేశారు. ధర్మవరం కోర్టులో ఆయనను హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. 4.14 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించనందున లీలాకుమార్‌పై పట్టుచీరల వ్యాపారులు ధర్మవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

06/23/2016 - 16:20

విజయవాడ: ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నందున ఘాట్లు, ఇతర నిర్మాణాలను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం ఇక్కడి కృష్ణానదీ తీరాన పనులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

06/23/2016 - 15:15

కడప: ఇక్కడి యోగి వేమన విశ్వవిద్యాలయంలో తేనెటీగల దాడిలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వీరిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. లా పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులపై తేనెటీగలు ఒక్కసారి దాడి చేయడం కలకలం సృష్టించింది.

06/23/2016 - 15:14

విజయవాడ: హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో భాగంగా వైద్యవిద్య డైరెక్టర్ (డిఎంఇ) కార్యాలయాన్ని గురువారం ఇక్కడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. తమ శాఖకు చెందిన మిగతా 18 కార్యాలయాలను కూడా నిర్ణీత సమయానికి ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

06/23/2016 - 15:14

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా పలు విషయాలను చర్చించారు. అమరావతి ప్రాంతంలో కల్పించే సౌకర్యాల గురించి సిఎం ప్రెజంటేషన్ ఇచ్చారు.

Pages