S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/06/2016 - 16:51

హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబు సాధిస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే విపక్ష నేత జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎంను అవమానిస్తే రాష్ట్ర ప్రజలందర్నీ అగౌరవపరచినట్టేనని, సభ్యత మరచిపోయి జగన్ నీచమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

06/06/2016 - 16:51

రాజమండ్రి: ఇక్కడ గతనెల 26న జరిగిన ధనాల రమేష్ అనే యువకుడి హత్యకు సంబంధించి 11 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాతక్షక్షల కారణంగానే రమేష్‌ను అతని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థివర్గానికి చెందినవారు రమేష్‌ను బలవంతంగా ఎత్తుకుపోయి నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి, మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వెనక పారేశారు.

06/06/2016 - 14:30

విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినప్పటికీ పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగానే ఉందని ఎపి డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి పోలీసు శాఖలోని పలు విభాగాలను ఇంకా తరలించాల్సి ఉందని, ఎపిఎస్పీకి 3వేల మంది ఇంకా రావాల్సిఉందని చెప్పారు. పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో ఆరువేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.

06/06/2016 - 14:29

విజయవాడ: తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేని విపక్ష నేత వైఎస్ జగన్ హుందాతనం మరచి మాట్లాడుతున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు మీడియాతో అన్నారు. జగన్ వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయాల్లో ఇలాంటి విపక్ష నాయకుడిని ఇంతవరకూ చూడలేదన్నారు.

06/06/2016 - 14:29

కర్నూలు: నోటిదురుసుతో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మహిళలు గరిటెలతో వాతలు పెట్టాలని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ జరిగిన నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతూ, సంస్కారం లేని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నందున ఇక మహిళలే అతనికి బుద్ధి చెప్పాలన్నారు.

06/06/2016 - 14:28

విజయవాడ: ఆక్యుపెన్సీ రేటును పెంచుకుని తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ఆ సంస్థ అధికారులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎపిఎస్ ఆర్టీసీ నడుపుతున్న ‘అమరావతి’ ఏసీ బస్సుల్లో ఇక ప్రయాణీకులు వారికి నచ్చిన టీవీ చానెల్ చూడొచ్చు. బస్సుల్లో టీవీ పెట్టి ఒకటో,రెండో సినిమాలు వేయడం, ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించడం వంటి ఏర్పాట్లకు భిన్నంగా ఇపుడు ఆర్టీసీ ప్రతి సీటుకూ ఒక చిన్న టీవీని అమరుస్తోంది.

06/06/2016 - 14:27

దిల్లీ: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎపి అభ్యంతరాలపై తమ వాదన వినిపించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం ఇక్కడికి చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఈ బృందం కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలుస్తుంది. హరీష్ రావు వెంట తెలంగాణ ఎంపీలు, నీటి పారుదల శాఖ నిపుణులు ఉన్నారు.

06/06/2016 - 14:26

విజయవాడ: దేశంలోనే మల్టీప్లెక్స్ థియేటర్‌ను కలిగిన తొలి బస్ స్టేషన్‌గా విజయవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ బస్ కాంప్లెక్సు అవతరించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు విరామ సమయంలో సినిమాలు చూసి కాలక్షేపం పొందేందుకు ఇక్కడ ‘వై స్క్రీన్స్’ పేరిట ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభించారు.

06/06/2016 - 14:25

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎపి సచివాలయ ఉద్యోగుల తరలింపులో ప్రస్తుతం అయోమయ పరిస్థితి నెలకొందని ఎపి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ అన్నారు. ఈ నెల 27 నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని సిఎం చెబుతున్నారని, వివిధ శాఖల ఉద్యోగుల తరలింపుపై నిర్దిష్ట విధానాన్ని ఈరోజు ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్నాయని దీంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు.

06/06/2016 - 12:19

విజయవాడ: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సమస్యలు ఎదురైనంత మాత్రాన నిరుత్సాహపడరాదని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉదయం వెలగపూడిలో పర్యటించి తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. అయిదు అంతస్థుల సచివాలయం, ఇతర నిర్మాణాలు, ప్రాథమిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష జరిపారు. వౌలిక వసతులు కల్పించి వీలైనంత త్వరగా సొంత రాష్ట్రంలో పాలన అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Pages