S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/17/2016 - 14:08

గుంటూరు: తమ పార్టీతో మిత్రపక్షంగా ఉంటున్నామన్న విషయాన్ని మరచిపోయి బిజెపి నాయకులు పరిధికి మించి మాట్లాడడం మంచిది కాదని టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సోము వీర్రాజు వంటి బిజెపి నేతలు ఎపి రాజధాని గురించి అనుచితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న సిఎం చంద్రబాబు మోదీతో భేటీ అవుతున్నారని, ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

05/17/2016 - 14:07

కర్నూలు: తెలంగాణలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపాలని కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్ చేస్తున్న జలదీక్ష మంగళవారం రెండోరోజుకు చేరింది. దీక్షా శిబిరం వద్ద వేదికపై ఉన్న ఆయనను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

05/17/2016 - 11:56

విజయనగరం: అయిదువేల రూపాయలు లంచం తీసుకుంటూ బొబ్బిలి మండలం కలువరాయి విఆర్‌ఓ మాధవనాయుడు మంగళవారం ఉదయం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. నిందితుడిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు.

05/17/2016 - 11:55

కర్నూలు: తెలంగాణలో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఎలా ఆపాలో తమకు తెలుసునని ఎపి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు నోటి దురుసును తగ్గించుకోవాలని, హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని మరువరాదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిరసనగా వైకాపా అధినేత కెసిఆర్ ఇంటి ఎదుటో లేదా దిల్లీలోనో దీక్షలు చేయాలే తప్ప కర్నూలులో కాదన్నారు.

05/17/2016 - 11:53

విజయవాడ: డిఎస్సీ-2014లో విజేతలకు జూన్ 1న నియామక పత్రాలను అందజేస్తామని ఎపి మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ తెలిపారు. టీచర్ల నియామకాలకు సంబంధించి షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. ఈనెల 26న ధ్రువపత్రాల పరిశీలన, 28న తుది జాబితా ప్రకటన, 29 నుంచి 31 వరకూ వెబ్ కౌనె్సలింగ్ జరుగుతాయని, జూన్ 1న సిఎం చేతుల మీదుగా నియామక పత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు.

05/17/2016 - 09:29

కాకినాడ, మే 16: ఈ ఏడాది అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలు తీవ్రస్థాయిలో వేట కొనసాగించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏటా మంచి డిమాండు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు సైతం ఈ సంవత్సరం విద్యార్థుల కోసం వెతుకులాట తప్పేలాలేదు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల కంటే ఆయా కళాశాలల్లో సీట్లు అధికంగా ఉండటం ఇందుకు కారణం కానున్నది.

05/17/2016 - 09:28

శ్రీకాకుళం, మే 16: సముద్రంలో కలుస్తున్న పరిశ్రమల కాలుష్యం నుండి మత్స్యసంపదకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర ఆహార ఉత్పత్తుల పరిశ్రమల శాఖ మంత్రి జ్యోతి నిరంజన్ సాథ్వి పేర్కొన్నారు. మత్స్యకారులను ఎస్‌టి జాబితాలో చేర్చాలంటూ సోమవారం ఇక్కడి మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ‘మత్స్యకార మహాగర్జన’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

05/17/2016 - 08:57

విజయవాడ, మే 16: తిరుపతిలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు సమీక్షించారు. సోమవారం విజయవాడలోని సిఎం కార్యాలయంలో రెండు రాష్ట్రాల మహానాడు కమిటీ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. సభావేదిక బ్యాక్‌డ్రాప్, వాహనాల పార్కింగ్, కార్యకర్తలకు బస, భోజన వసతులు, మంచినీటి వసతి, తదితర ఏర్పాట్లపై కమిటీలకు దిశానిర్దేశం చేశారు.

05/17/2016 - 08:54

ఆళ్లగడ్డ, మే 16 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోటకందుకూరు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మపై శిరివెళ్లకు చెందిన రాజు సోమవారం యాసిడ్‌తో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ సంఘటనకు సంబంధించి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. కోటకందుకూరుకు చెందిన సుబ్బలక్ష్మమ్మను శిరివెళ్లకు చెందిన నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగ సంతానం.

05/17/2016 - 08:52

ఏలూరు, మే 16: అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్ రద్దుచేయాలని కోరుతూ బాధితుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈమేరకు ఒక వినతిపత్రాన్ని సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

Pages