S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/28/2016 - 15:20

తిరుపతి: టిడిపి మహానాడులో శనివారం 2015-16లో పార్టీ జమ-ఖర్చుల వివరాలను మంత్రి శిద్దా రాఘవరావు సమర్పించారు. రూ.17,97,81,000 ఆదాయం రాగా.. రూ.13,10,73,000 ఖర్చయిందని ఆయన తెలిపారు. సభ్యత్వ రుసుం, విరాళాల ద్వారా పార్టీకి రూ.11,13,12,000 వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ 4,82,08,000 జమ అయినట్లు తెలిపారు. పార్టీకి రూ.52,90,41,000 ఆస్తులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

05/28/2016 - 12:22

నెల్లూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల శనివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు ఆరు సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. భూ ప్రకంపనలతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటవలి కాలంలో ఈ రెండు జిల్లాల్లో ప్రకంపనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

05/28/2016 - 12:21

హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని ఎపి పిసిసి అధినేత రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను శనివారం ఉదయం కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం కలిశారు. కాపుగర్జనకు సహకరించినందుకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. కాపుల పోరాటానికి తమ పార్టీ నేతలు సోనియా, రాహుల్ గాంధీ ఇదివరకే సంఘీభావం ప్రకటించారని రఘువీరా అన్నారు.

05/28/2016 - 12:20

విశాఖ: పిడుగుపడి ఓ యువకుడు మరణించిన ఘటన ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం వద్ద శనివారం ఉదయం జరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, విశాఖ నగరంతో పాటు పలు మండలాల్లో శనివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

05/28/2016 - 12:19

విజయవాడ: ఇక్కడి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. రన్‌వే పైనుంచి టేకాఫ్ అవుతుండగా విమానం రెక్కల్లోకి పక్షి దూరింది. ఈ విషయాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

05/28/2016 - 12:18

శ్రీకాకుళం: రోడ్డుపై ఆగిఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మరణించిన దుర్ఘటన శనివారం సోంపేట మండలం లక్కవరం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా చింతలపల్లి నుంచి మామిడిపండ్ల లోడుతో ఒడిశాలోని బరంపురం వెళుతున్న వ్యాన్ రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో మామిడిపండ్ల వ్యాపారి రాముతో పాటు వ్యాన్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

05/28/2016 - 12:18

తిరుపతి: టిడిపి మహానాడు రెండోరోజు కార్యక్రమాలు శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు సిఎం చంద్రబాబు, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు, ఇతర నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

05/28/2016 - 07:50

హైదరాబాద్, మే 27: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో పార్టీ వైఫల్యాల గురించి ప్రస్తావించకుండా వైకాపా అధ్యక్షుడు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం తగదని వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారన్నారు.

05/28/2016 - 07:44

విశాఖపట్నం, మే 27: బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి నిమిత్తం ఎన్నో పథకాలను అమలు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లను కేటాయించారని తెలిపారు.

05/28/2016 - 07:42

విశాఖపట్నం, మే 27: బ్రాహ్మణ కార్పొరేన్‌షన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ముందుగా పీఠంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకున్నారు. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

Pages